Ice Cream : లొట్టలేసుకుని మరీ ఐస్ క్రీమ్స్ లాగించేస్తున్నారా? బీ కేర్‌ఫుల్, పోలీసుల దాడుల్లో షాకింగ్ నిజాలు

Ice Cream: కాసుల కక్కుర్తితో కొందరు కేటుగాళ్లు ఐస్ క్రీమ్ లను కల్తీ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.

Ice Cream : లొట్టలేసుకుని మరీ ఐస్ క్రీమ్స్ లాగించేస్తున్నారా? బీ కేర్‌ఫుల్, పోలీసుల దాడుల్లో షాకింగ్ నిజాలు

Ice Cream(Google :Photo)

Ice Cream : ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. చిన్న, పెద్ద అనే తేడా లేదు. అంతా ఐస్ క్రీమ్స్ ని లైక్ చేస్తారు. పైగా ఇప్పుడు అసలే సమ్మర్. దీంతో ఐస్ క్రీమ్స్ కి మరింత డిమాండ్ పెరిగింది. మండుటెండల్లో చల్లచల్లని ఐస్ క్రీమ్ తింటే ఆ మజానే వేరు. అయితే, ఐస్ క్రీమ్ లవర్స్ జాగ్రత్త పడాల్సిందే. పిల్లలు అడిగారు కదా అని వెంటనే ఐస్ క్రీమ్ కొనిచ్చారో ఇక అంతే సంగతులు. ఐస్ క్రీమ్.. ఆరోగ్యం పాలిట శాపంగా మారుతోంది. ఎందుకంటే.. ఐస్ క్రీమ్ లను కల్తీ చేస్తున్నారు.

కాసుల కక్కుర్తితో కొందరు కేటుగాళ్లు ఐస్ క్రీమ్ లను కల్తీ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి తమ జేబులు నింపుకుంటున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించరు. అపరిశుభ్ర వాతావరణం. హానికారక, ప్రమాదకర కెమికల్స్ వినియోగం. ఇదీ చాలా చోట్ల జరుగుతున్న తంతు. పైనేమో బ్రాండెడ్ ఐస్ క్రీమ్ కంపెనీ లేబుల్స్ ఉంటాయి. లోనేమో నాసిరకపు సరుకు ఉంటుంది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా కల్తీ చేసిన ఐస్ క్రీమ్స్ ను మార్కెట్ లో అమ్మేస్తున్నారు మోసగాళ్లు.(Ice Cream)

Also Read..Chocolates : ఈ చాక్లెట్లు తింటే చావే..! హైదరాబాద్‌లో దారుణం.. పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు

వివిధ బ్రాండ్ల పేరుతో అమ్ముతున్న ఐస్ క్రీమ్ ల తయారీలో కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. అక్రమార్జన కోసం వక్ర మార్గాలు పడుతున్నారు. తెలంగాణలో పలు చోట్ల కల్తీ ఐస్ క్రీమ్ ల కలకలం రేగింది. పోలీసుల దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. అపరిశుభ్ర వాతావరణంలో విషపూరిత రసాయనాలు, హానికరమైన రంగులు కలిపి ఐస్ క్రీమ్ లు తయారు చేసి మార్కెట్ లో విడుదల చేస్తున్నారు. వికారాబాద్, పరిగి, తాండూర్ లో పలు ఐస్ క్రీమ్ తయారీ ఫ్యాక్టరీలను పోలీసులు సీజ్ చేశారు. అక్కడ జరుగుతున్న తంతు చూసి షాక్ అయ్యారు. ఐస్ క్రీమ్ లు కల్తీ చేస్తున్న వైనం విస్మయానికి గురయ్యారు.

ఐస్ క్రీమ్ తయారీలో విషపూరిత రసాయనాలు వాడుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఆకర్షణీయంగా ఉంటూ మిలమిల మెరిసేందుకు కెమికల్స్ వాడుతున్నట్లు గుర్తించారు. ఈ కెమికల్స్ రక్తనాళాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పరిశోధనలో తేలింది.(Ice Cream)

Also Read..Adulterated Ice Creams : బాబోయ్.. ఈ ఐస్‌క్రీమ్స్ తింటే ప్రాణాలకు ముప్పే..! హైదరాబాద్‌లో మరో దారుణం, గుట్టుగా దందా

ఐస్ క్రీమ్ ల తయారీలో నిర్దేశిత ప్రమాణాలు పాటించడం లేదని తనిఖీల్లో తేలింది. రూ.29లక్షల విలువ చేసే కల్తీ ఐస్ క్రీమ్స్ తో పాటు హానికరమైన రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు టేస్ట్ పెరగడానికి ప్రమాదకరమైన పౌడర్ ను వాడుతున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఇలా తయారు చేసిన ఐస్ క్రీమ్స్ కు బ్రాండెడ్ ఐస్ క్రీమ్ కంపెనీల లేబుల్స్ వేసి మార్కెట్ లోకి విడుదల చేసి సొమ్ము చేసుకుంటున్నారు కేటుగాళ్లు. అంతేకాదు శుభకార్యాలకు కూడా సప్లయ్ చేసి డబ్బు ఆర్జిస్తున్నారు కంత్రీగాళ్లు. ధనార్జనే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ కల్తీలకు పాల్పడుతున్న కొందరు నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పైగా ఆయా ఐస్ క్రీమ్ తయారీ ఫ్యాక్టరీలకు అనుమతులు కూడా లేవని పోలీసులు గుర్తించారు.