Chocolates : ఈ చాక్లెట్లు తింటే చావే..! హైదరాబాద్‌లో దారుణం.. పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు

Chocolates : ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల మధ్య నడుపుతున్న చాక్లెట్ల తయారీ పరిశ్రమపై ఎస్వోటీ పోలీసులు మెరుపు దాడి చేశారు.

Chocolates : ఈ చాక్లెట్లు తింటే చావే..! హైదరాబాద్‌లో దారుణం.. పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు

Chocolates

Chocolates : కాసుల కోసం కొందరు దుర్మార్గులు నీచానికి ఒడిగడుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాపారం చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. డబ్బు సంపాదనే లక్ష్యంగా దారుణాలకు పాల్పడుతున్నారు. చివరికి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్లు, లాలీ పాప్ లను కూడా కేటుగాళ్లు వదల్లేదు. కలుషిత నీటితో, ప్రమాదకర కెమికల్స్ తో చాక్లెట్లు, లాలీపాప్స్ తయారు చేసి మార్కెట్ లోకి వదులుతున్నారు. పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు.

హైదరాబాద్ లో దారుణం వెలుగుచూసింది. అత్తాపూర్ లో నాసిరకం చాక్లెట్ల తయారీ దందా బయటపడింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల మధ్య నడుపుతున్న చాక్లెట్ల తయారీ పరిశ్రమపై ఎస్వోటీ పోలీసులు మెరుపు దాడి చేశారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు ఈ దాడి చేశారు.

Also Read..Writing is medicine : 20 నిముషాల చేతిరాత డిప్రెషన్‌ను తగ్గిస్తుందట..

పోలీసుల దాడిలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఈ పరిశ్రమలో విషపూరిత రసాయనాలు, కలుషిత నీటితో చాక్లెట్లు, లాలీపాప్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వాటిని మార్కెట్ లో విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు ఎస్వోటీ పోలీసులు చెబుతున్నారు.

కలుషిత, అపరిశుభ్ర వాతావరణంలో డ్రమ్ముల్లో పానకం నిల్వ చేసి, ఆ పానకంతోనే చాక్లెట్స్ తయారు చేస్తున్నారు. ఇలాంటి చాక్లెట్లను పిల్లలు తింటే వారి ప్రాణాలు ప్రమాదంలో పడటం ఖాయమంటున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి కేటుగాళ్లను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వినిపిస్తోంది.

Also Read..experts warning : ప్రెగ్నెంట్ లేడీస్ జుట్టుకి రంగు వేసుకుంటున్నారా? ఎంత ప్రమాదకరమో తెలుసా…