experts warning : ప్రెగ్నెంట్ లేడీస్ జుట్టుకి రంగు వేసుకుంటున్నారా? ఎంత ప్రమాదకరమో తెలుసా…

జుట్టుకి రంగు వేసుకోవడం మామూలు. సాధారణమైన సమయాల్లోనే తగు జాగ్రత్తలు తీసుకుని హెయిర్ డైలు వాడాలి. ఇక గర్భధారణ సమయంలో స్త్రీలు జుట్టుకి రంగులు వాడటం ఎంతవరకూ సేఫ్ అంటే.. ఖచ్చితంగా సేఫ్ కాదంటున్నారు నిపుణులు..

experts warning : ప్రెగ్నెంట్ లేడీస్ జుట్టుకి రంగు వేసుకుంటున్నారా? ఎంత ప్రమాదకరమో తెలుసా…

experts warning

experts warning :  ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా జట్టు నెరిసిపోవడం కామన్ అయిపోతోంది. చిన్నపిల్లల్లో సైతం ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో జుట్టుకి హెన్నా (henna).. రంగులు (hair colours) వేసుకోవడం తప్పట్లేదు. అయితే ప్రెగ్నెన్సీ (pregnancy) సమయంలో కూడా కొంతమంది మహిళలు జుట్టుకి రంగులు వాడతారు. అలా చేయడం సేఫ్ కాదని మీలో ఎంతమందికి తెలుసు? ఒకసారి ఇది చదవండి.

Keep Your Lungs : కోవిడ్ వ్యాప్తి నేపధ్యంలో మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకునే మార్గాలు !

ఇటీవల కాలంలో జుట్టుకి హెన్నాలు, డైలు వాడటం సర్వసాధారణం అయిపోయింది. అయితే అందరికీ హెయిర్ డైలు (hair dye) పడవు. అవి రకరకాల ఎలర్జీలకు (allergy) కారణం అవుతూ ఉంటాయి. అందుకే ముందుగా టెస్ట్ చేసుకున్న తర్వాత హెయిర్ డై వేసుకోవాలి. గర్భధారణ సమయంలో ప్రతి స్త్రీ తన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తినే ఆహారం దగ్గరనుంచి తలకు పెట్టుకునే ఆయిల్స్, రంగులు వరకు.. ఎందుకంటే గర్భం ధరించిన మూడవ నెల తరువాత తలకి రంగు వేసుకుంటే పుట్టబోయే పిల్లలు తక్కువ బరువుతో పుడతారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక ఊరు పేరు లేని రంగుల్ని తలకి పూసుకోవడం మరింత ప్రమాదకరమని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భం ధరించిన స్త్రీ రంగు వేసుకోవడం ద్వారా అది రక్తంలో కలిసి పుట్టబోయే బిడ్డకు ప్రమాదకం కూడా కావచ్చట.

Corn Flakes : అల్పాహారంగా కార్న్ ఫ్లేక్స్ తింటున్నారా? వీటిని తినటం ఆరోగ్యానికి అంత మంచిది కాదా?

3వ నెల నుంచి కడుపులో పిండం ఎదుగుదల మొదలవుతుంది. అలాంటి సమయంలో తలకి రంగు వేసుకోవడం వల్ల శిశువు ఎదుగుదలకు అది ఇబ్బంది కలిగించవచ్చును. తప్పనిసరి పరిస్థితుల్లో జుట్టుకి హెన్నా లేదా సహజసిద్ధమైన వెజిటబుల్ డైలను (Vegetable Dye) వాడాలని సూచిస్తున్నారు. ఇక గర్భం దాల్చిన 12 వారాల తర్వాత కానీ జుట్టుకి రంగు వేసుకోవడం సరికాదని కూడా చెబుతున్నారు. తలపై ఏదైనా గాయాలున్నా కూడా రంగు వాడటం ప్రమాదకరమని చెబుతారు. రంగు వేసుకునేటపుడు చేతికి గ్లౌజులు (gloves) వాడటం కంపల్సరీ. డై వేసుకున్న నిర్ణీత సమయం వరకూ మాత్రమే ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యంతో పాటు బిడ్డ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని గర్భధారణ సమయంలో హెయిర్ డైలకు దూరంగా ఉండటమే ఉత్తమం.