Corn Flakes : అల్పాహారంగా కార్న్ ఫ్లేక్స్ తింటున్నారా? వీటిని తినటం ఆరోగ్యానికి అంత మంచిది కాదా?

అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం, భారీగా ప్రాసెస్ చేయబడిన ఆహారాల వినియోగం విషయంలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వాటిలో కొన్ని క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వు, చక్కెర మరియు సోడియం అధికంగా ఉంటాయి.

Corn Flakes : అల్పాహారంగా కార్న్ ఫ్లేక్స్ తింటున్నారా? వీటిని తినటం ఆరోగ్యానికి అంత మంచిది కాదా?

Eating corn flakes for breakfast? Isn't eating these good for health?

Corn Flakes : ఉరుకుల పరుగుల జీవనశైలిలో మనం చేయాల్సిన పనులన్నీ క్షణాల్లో అయిపోవాలని కోరుకుంటుంటాం. తప్పులేదు కాని అన్నింటి విషయంలో ఇలా చేయటం ఏమాత్రం సరైంది కాదు ముఖ్యంగా మనం తినే ఆహారం విషయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే అది ఆరోగ్యపైనే ప్రభావం చూపిస్తుంది. రోజువారిగా తీసుకునే అల్పాహారం విషయంలో చాలా మంది తప్పులు చేస్తుంటారు.  త్వరగా ప్రిపేర్ చేయవచ్చన్న ఉద్దేశంతో కార్న్‌ఫ్లేక్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాల వైపు మొగ్గు చూపుతారు.

ప్రతిరోజూ ఉదయం అనేక మంది వివిధ బ్రాండ్‌లలో లభిస్తున్న కార్న్‌ఫ్లేక్‌లను తమ కుటుంబసభ్యులకు అల్పాహారంగా తయారు చేసి అందిస్తున్నారు. అయితే రోజూ కార్న్‌ఫ్లేక్స్ తినడం ఆరోగ్యానికి మంచిదా లేదంటే చెడ్డదా అన్న విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

కార్న్ ఫ్లేక్స్ ఆరోగ్యానికి హానికరమా ?

అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం, భారీగా ప్రాసెస్ చేయబడిన ఆహారాల వినియోగం విషయంలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వాటిలో కొన్ని క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వు, చక్కెర మరియు సోడియం అధికంగా ఉంటాయి. ఇవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు మరియు అధిక రక్తపోటు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కార్న్ ఫ్లేక్స్‌లో షుగర్, మాల్ట్ ఫ్లేవరింగ్, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ తదితర పదార్థాలుంటాయి. ఇవి నిజానికి హై గ్లెసీమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉండి శరీరంలోకి ప్రవేశించిన వెంటనే.. రక్తంలో గ్లూకోజ్స్థా యిలు అమాంతం పెరిగేలా చేస్తాయి. దీంతో ఇన్సులిన్ పెద్ద ఎత్తున విడుదలవుతుంది. అందువల్ల మెదడు కొంత సేపు చలనం లేకుండా మారిపోతుంది. చురుగ్గా ఉండటం కష్టతరమౌతుంది. దీనికి తోడు కార్న్ ఫ్లేక్స్‌ను తినడం డయాబెటిస్ పేషెంట్లకు ఏమాత్రం మంచిది కాదు. రక్తంలో షుగర్ స్థాయిలు అమాంతం పెరిగే ప్రమాదం ఉంటుంది.

కార్న్ ఫ్లేక్స్‌లో ఫ్యాట్, చక్కెర ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి. కార్న్ ఫ్లేక్స్ తయారీలో వాడే హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ మంచిది కాదు. సాధారణ పిండిపదార్థాతోపాటు ఇందులో కెమికల్ స్వీట్ ఫ్లేవర్డ్ ఎసెన్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి నష్టాన్ని కలిగిస్తాయి. అధిక బరువు సమస్యకు కారణమౌతాయి. దీనికి తోడు దంత క్షయం, డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.