Writing is medicine : 20 నిముషాల చేతిరాత డిప్రెషన్‌ను తగ్గిస్తుందట..

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో డిప్రెషన్ ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అనేకమంది దీని బారిన పడుతున్నారు. డిప్రెషన్ నుంచి బయటకు రాలేక సతమతమవుతున్నారు. డిప్రెషన్‌ను జయించడానికి చేతిరాత కూడా ఉపయోగపడుతుందట.. అదెలాగో చదవండి.

Writing is medicine : 20 నిముషాల చేతిరాత డిప్రెషన్‌ను తగ్గిస్తుందట..

Writing is medicine

Writing is medicine : డిప్రెషన్ ( depression) ఇటీవల కాలంలో చాలామందిలో కనిపిస్తున్న సమస్య. ఏదో తెలియని నిరాశ.. నిస్పృహ.. జీవితంలో సర్వం కోల్పోయినట్లు దిగులు పడటం.. ఇంక ఏమీ సాధించలేమనే ఆందోళనలో ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఈ డిప్రెషన్ చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారిని విపరీతంగ కృంగ దీస్తోంది. మెడిటేషన్‌తో (meditation) కొందరిలో ఇది సర్దుకుంటే దీర్ఘకాలం పాటు మందులు (Medicines) వాడితేనే కానీ నయం కాని వారు ఉన్నారు. అయితే చేతి రాతల ద్వారా డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు అని ప్రముఖ రచయిత (writer), కథకురాలు (storyteller) హర్షదా పఠారే (Harshada Pathare) చెబుతున్నారు.

Haleem : పోషకాలతో నిండిన హలీమ్ ఆరోగ్యానికి మంచిదే !

ఒకప్పుడు చేతి రాతకి (hand writing) చాలా ప్రాముఖ్యత ఉండేది. ఎవరితో కమ్యూనికేట్ అవ్వాలన్నా రాయడం ప్రధానంగా ఉండేది. . ఇప్పుడు అంతా డిజిటల్ యుగం కావడంతో రాసే వారు తగ్గిపోయారు. అయితే రాయడం అనేది ఒత్తిడిని తగ్గిస్తుంది అంటే మీరు నమ్ముతారా? హర్షదా అదే చెబుతున్నారు. డిప్రెషన్ నుంచి బయటపడటానికి రాయడం ఎంతో ఉపకరిస్తుందట. రాయడం ద్వారా మన మనసులో ఉన్న భావాల్ని కాగితం మీద పెడతాం. ఇలా చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవడంతో ఒత్తిడి తగ్గుతుంది. తిరిగి మరలా రాసిన దాన్ని చదవడం వల్ల మనలో ఉండే నిరాశ పోతుంది. ఇక రాయడం వల్ల మన ఆలోచనల్లో ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఈ విషయం అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ (Michigan State University) పరిశోధకులు కూడా వెల్లడించారు. అదే విషయాన్ని హర్షదా కూడా చెబుతున్నారు. ఇది వరకూ చాలామందిలో డైరీ రాసే అలవాటు ఉండేది. కొత్త సంవత్సరం వస్తోందంటే డైరీ కొనడం జీవితాల్లో భాగంగా ఉండేది. డైరీ రాసే అలవాటు కూడా మనలో ఉండే స్ట్రెస్‌ని (stress) తగ్గిస్తుందిట.

Foods to Avoid in Summer : వేసవిలో ఈ ఆహారాల విషయంలో జాగ్రత్తలు ఆరోగ్యానికి మంచిది !

చేతిలో సెల్ ఫోన్ ఉంటే ఇక చేతి రాతలకు టైం ఎక్కడి అనుకునే వారు ఉంటారు. కానీ మన మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందంటే అలవాటు చేసుకోవడమే మేలు కదా.. రోజులో 20 నిముషాల పాటు మన ఎమోషన్స్ ని చేతి రాతల ద్వారా వ్యక్తీకరించడం వల్ల డిప్రెషన్ ను జయించవచ్చని హర్షదా చెబుతున్నారు. ఏదో కొద్దిరోజులు రాసాము.. తర్వాత పక్కన పడేసామన్నట్లు కాకుండా క్రమం తప్పకుండా అలవాటు చేసుకుంటే డిప్రెషన్ నుంచి బయటపడొచ్చట. బీపీ, సుగర్, లివర్ తదితర సమస్యలతో బాధపడేవారిలో కూడా డిప్రెషన్ ఉంటుంది. ఎప్పుడైతే డిప్రెషన్ నుంచి బయటపడతారు ఈ సమస్యలన్నీ ఉపశమనం పొందవచ్చు. ఇక డిప్రెషన్ తగ్గితే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. మంచి నిద్ర ఆరోగ్యానికి మేలు అన్న విషయం మీకు తెలిసిందే. కాబట్టి రోజులో కాస్త సమయాన్ని ఎంచుకుని ఏదో ఒకటి రాయడం ద్వారా డిప్రెషన్ ను తగ్గించుకోవడం మేలు.