Karthika Pournami: కార్తీక పౌర్ణమి రోజున.. శివ లింగానికి ఇలా అభిషేకం చేస్తే.. మీ ఇంట్లో బంగారానికి లోటుండదు..!
అలాగే సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం రావాలంటే 365 వత్తుల దీపాన్ని ఆవు నెయ్యిలో ముంచి వెలిగించాలి.
Karthika Pournami: నవంబర్ 5.. బుధవారం.. కార్తీక పౌర్ణమి.. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే దారిద్ర్య బాధలు తొలగి ధన లాభం కలుగుతుందో, అప్పుల సమస్య నుంచి బయటపడచ్చో, సర్వ సంపదలు ఎలా సిద్ధిస్తాయో తెలుసుకుందాం.
కార్తీక పౌర్ణమి రోజున అందరూ సూర్యదయానికి ముందే చన్నీళ్లతో స్నానం చేయాలి. అలా చేయలేని వాళ్లు గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. సూర్యోదయానికి ముందే స్నానం చేయడానికి వీలుకాని ఎవరైనా సరే.. కార్తీ పౌర్ణమి రోజున.. స్నానం చేసేటప్పుడు గంగ యుమన సరస్వతి అని మూడుసార్లు అనుకుంటూ స్నానం చేయాలి. ఆ స్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైనా సరే ఆవు పాలతో శివాభిషేకం చేసినట్లైతే.. జీవితంలో వారికి బంగారానికి, వెండికి లోటు ఉండదు. కావాల్సినంత బంగారం, కావాల్సినంత వెండి జీవితంలో కొనుక్కునే యోగం రావాలంటే కార్తీక పౌర్ణమి రోజున కచ్చితంగా ఆవు పాలతో శివ లింగానికి అభిషేకం చేయాలి.
కార్తీక పౌర్ణమి రోజున శివుడిని, లక్ష్మీదేవిని మారేడు దళాలతో పూజించినట్లైతే జన్మజన్మల దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, గొడవలు ఎక్కువగా ఉన్న వారు కార్తీక పౌర్ణమి రోజున ఆవు పాలతో చేసిన పాయం లక్ష్మీ నారాయణులకు నైవేద్యంగా సమర్పించాలి. ఇంట్లో లక్ష్మీ నారాయణుల ఫోటో దగ్గర నైవేద్యంగా సమర్పించవచ్చు. లేదా ఆలయంలో లక్ష్మీ నారాయణులకైనా నైవేద్యంగా సమర్పించొచ్చు. దాన్ని ప్రసాదంగా స్వీకరించడం, ఇతరులకు పంచి పెట్టడం ద్వారా కుటుంబకలహాలన్నీ తొలగిపోతాయి.
అష్ట దరిద్రాలు తొలగిపోవాలంటే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దానం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల దరిద్ర్యం తొలగిపోవడంతో పాటు తొందరలోనే గృహ యోగం కలుగుతుంది. అరటి ఆకులో ఆవు పాల ప్యాకెట్, ఆవు పెరుగు ప్యాకెట్, ఆవు నెయ్యి ప్యాకెట్ దేవాలయంలో పంతులుకి దానం ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. సమస్త శుభాలు చేకూరతాయి. కార్తీక పౌర్ణమి రోజున అన్నదాం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి.
దీన్ని దానం చేస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం..!
కుబేరుడి దగ్గర ఉన్న నవ నిధులు మనం దానం చేసిన ఫలితం రావాలంటే కార్తీక పౌర్ణమి రోజున శివాలయ ప్రాంగణంలో మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించి, ఆ దీపాన్ని దానం ఇవ్వాలి. కార్తీక పౌర్ణమి రోజున దీప దానం చేస్తే కుబేరుడి దగ్గర నవ నిధులు దానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే ఈ దీప దానం వల్ల కోటి యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది. కార్తిక పౌర్ణమి రోజున శివాలయంలో కొండెక్కిన దీపాన్ని వెలిగించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.
కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించినా, దానం చేసినా కోటి యజ్ఞాలు చేసిన ఫలితం కలిగి సమస్యలన్నీ తొలగిపోతాయి. కార్తిక పౌర్ణమి రోజున తులసికోట దగ్గర ఉసిరక దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఉసిరికాయపైన పెచ్చు తీసి ఆవు నెయ్యిలో తడిపిన ఒత్తి వేసి కార్తీక పౌర్ణమి రోజున తులసి కోట దగ్గర ఉసిరిక దీపాలు వీలైనన్ని వెలిగించాలి. బియ్యం పిండితో చేసిన పిండి దీపాలు ఉసిరిక చెట్టు దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ వెలిగించాలి. తులసి కోటలో ఉసిరిక కొమ్మ ఉంచి లేదా తులసి కోట పక్కనే ఉసిరిక చెట్టు పెట్టుకుని.. ఉసిరిక లేదా పిండి దీపాలు ఇంటి ఆవరణలో వెలిగించుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీనారాయణులు ఆనంద తాండవం చేస్తారు.
జ్వాలా తోరణం దర్శనం చేసుకోవాలి..
అలాగే సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం రావాలంటే 365 వత్తుల దీపాన్ని ఆవు నెయ్యిలో ముంచి వెలిగించాలి. అలాగే కార్తీక పౌర్ణమి రోజున దేవాలయంలో జ్వాలా తోరణం దర్శనం చేసుకోవాలి. శివాలయాల్లో జ్వాలా తోరణం నిర్వహిస్తారు. గడ్డిని తోరణాల్లా ఏర్పాటు చేసి నువ్వుల నూనెలో ముంచిన వస్త్రాలను ఆ గడ్డికి చుట్టి నిప్పంటించి పార్వతి పరమేశ్వరుల విగ్రహాలు అటు ఇటు మూడుసార్లు తిప్పుతారు. దీన్నే జ్వాలా తోరణం అంటారు. దీన్ని చూస్తేనే సమస్త దృష్టి దోషాలు తొలగిపోతాయి.
Also Read: కార్తీక పౌర్ణమి.. ఏమేం చేయాలి, పండితులు ఏం చెబుతున్నారు..
