గుండెలను పిండేస్తున్న వీడియో.. 38 ఏళ్లు స్కూల్‌లో పనిచేసిన ప్యూన్.. ఇప్పుడు చివరిసారి బెల్ కొట్టి గుడ్ బై..
ఈ వీడియో కన్నీళ్లు తెప్పిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: మనం చదువుకున్న పాఠశాల అంటే అక్కడి గోడలు, తరగతి గదులు మాత్రమే కాదు.. అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు గుర్తుకువస్తారు. టీచర్లను మాత్రమే కాదు.. ప్యూన్‌లను కూడా జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం. ప్యూన్ రానిదే స్కూల్ పరిశుభ్రంగా ఉండదు.. గదుల తలుపులు తెరిచేవారు, బెల్ కొట్టేవారు ఉండరు.
ఉదయాన్నే ప్యూన్ బెల్ కొడితే స్కూల్లో ప్రార్థన మొదలవుతుంది. సాయంత్రం బెల్ కొడితే స్కూల్ ముగుస్తుంది. అటువంటి ప్యూన్ ఒకరు ఒకే స్కూల్‌లో 38 ఏళ్లు చేసి, చివరిసారిగా బెల్ కొట్టాడు. ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. (Viral Video)
స్కూల్లో చివరిసారిగా అతడు బెల్ కొడుతుండగా విద్యార్థులు అందరూ చెప్పట్లు కొడుతూ, కేకలు వేశారు. 38 ఏళ్ల తర్వాత దాస్ అంకుల్ చివరిసారి బెల్ మోగించాడని, అతని నవ్వు, నిశ్శబ్దం , అతని ఉనికి ఇవన్నీ పాఠశాల గుండె చప్పుడు అని వీడియో క్యాప్షన్‌లో పేర్కొన్నారు.
ఇవాళ చివరిసారి దాస్ బెల్ మోగించినప్పుడు, తాము అతడి సేవలను గుర్తుచేసుకున్నామని రాశారు. ఈ వీడియో కన్నీళ్లు తెప్పిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram