Shambhala : ఆది సాయి కుమార్ శంబాల ట్రైలర్ సక్సెస్ మీట్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

తాజాగా మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ సక్సెస్ మీట్ నిర్వహించారు.(Shambhala)

Shambhala : ఆది సాయి కుమార్ శంబాల ట్రైలర్ సక్సెస్ మీట్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

Shambhala

Updated On : November 5, 2025 / 7:41 AM IST

Shambhala : ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘శంబాల’. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మాణంలో డైరెక్టర్ యుగంధర్ ముని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. పీరియాడిక్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్స్ రిలీజ్ చేసి ఆసక్తి నెలకొల్పారు. తాజాగా మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ సక్సెస్ మీట్ నిర్వహించారు.(Shambhala)

ఈ ఈవెంట్లో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. మా టీజర్‌ను రిలీజ్ చేసిన దుల్కర్ గారికి, మాకు సపోర్ట్ చేసిన థమన్, నా ఫ్రెండ్ సందీప్ కిషన్, ట్రైలర్ రిలీజ్ చేసిన డార్లింగ్ ప్రభాస్ గారికి ధన్యవాదాలు. ట్రైలర్ చూసి సినీ పరిశ్రమలో చాలా మంది ఫోన్స్ చేసి మెచ్చుకున్నారు. ఇంత ముందుగా ట్రైలర్ రిలీజ్ చేయడంతో మా సినిమాకు బజ్ వచ్చింది. హిందీ రిలీజ్ గురించి కూడా అడుగుతున్నారు. డిసెంబర్ 25న మా సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఎవర్ని నిరాశపరచదు. ఓ డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్నాం అని అన్నారు.

Also Read : Baahubali The Eternal War : ‘బాహుబలి ది ఎటర్నల్ వార్’ టీజర్ వచ్చేసింది.. బాహుబలి నెక్స్ట్ పార్ట్ అదిరిందిగా.. తన మరణం ముగింపు కాదు..

డైరెక్టర్ యుగంధర్ ముని మాట్లాడుతూ.. శివుడు ఆశీస్సులతో మా ‘శంబాల’కు అంతా పాజిటివిటీనే వస్తుంది. టాలీవుడ్ అంతా మా కోసం వస్తున్నారు. సాయి కుమార్ గారి వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. ఇది థియేటర్‌లో చూడాల్సిన సినిమా. టెక్నికల్‌గా కూడా గొప్ప స్థాయిలో ఉంటుంది. ట్విస్ట్, టర్న్స్ అన్నీ అదిరిపోతాయి అని అన్నారు.

రవి వర్మ మాట్లాడుతూ.. కల్కి సినిమాతో శంబాల అనే పదానికి ప్రాముఖ్యత వచ్చింది. అది మా శంబాల ప్రమోషన్స్ కి పనికొచ్చింది అని అన్నారు. సీరియల్ నటుడు ఇంద్రనీల్ మాట్లాడుతూ.. శంబాల నాకు కమ్ బ్యాక్ మూవీ అవుతుంది అని అన్నారు.

Also See : Sravanthi Chokarapu : కార్తీక పౌర్ణమి స్పెషల్.. ఉదయాన్నే పూజ చేసి ఫోటోలు షేర్ చేసిన యాంకర్ స్రవంతి..