Viral Video : ఈ వీడియో చూస్తే ఇంక బేకరీ ఫుడ్ తినరు–పిచ్చి చేష్టలు చేస్తున్న బేకరి వర్కర్లు

కొన్ని కొన్ని హోటల్స్‌లో తినుబండారాలు తయారు చేసే ప్రదేశాలు చూస్తే ఇంక ఆ పదార్ధాల మీద విరక్తి కలుగుతుంది.

Viral Video : ఈ వీడియో చూస్తే ఇంక బేకరీ ఫుడ్ తినరు–పిచ్చి చేష్టలు చేస్తున్న బేకరి వర్కర్లు

Rusk Bakery Factory

Viral Video :  కొన్ని కొన్ని హోటల్స్‌లో తినుబండారాలు తయారు చేసే ప్రదేశాలు చూస్తే ఇంక ఆ పదార్ధాల మీద విరక్తి కలుగుతుంది. గత నెలలో అస్సాంలోని గౌహతిలో పానీపూరి పానీయంలో మూత్రం కలుపుతున్న వీడియో వైరల్ అయిన ఘటన మరువక ముందే తాజాగా అటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ వీడియో చూస్తే ఇంక టీ తో పాటు రస్కులు, టోస్ట్ లు తినటానికి భయం వేసేంతగా ప్రవర్తించారు బేకరీ వర్కర్లు ఈ వీడియోలో. ఎందుకంటే… టోస్టుల‌ను త‌యారు చేసే వ‌ర్క‌ర్లు.. వాటిని త‌యారు చేసిన త‌ర్వాత ట్రేలలో పెట్టి వాటిని కాళ్లతో తొక్కిపెట్టి ప్యాక్ చేయటం.. వాటి మీద ఉమ్మి వేయ‌డం, వాటిని నాక‌డం లాంటివి చేస్తూ ప్యాకింగ్ చేస్తున్నారు.

కొంద‌రు వ‌ర్క‌ర్లు చేస్తున్న ఆ పిచ్చి చేష్ట‌ల వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో, ఎప్పుడు జరిగిందో తెలియ‌దు కానీ.. ఆ వీడియోను చూసిన నెటిజ‌న్లు మాత్రం తీవ్ర‌స్థాయిలో ఛీ కొడుతూ… విరుచుకు ప‌డుతున్నారు.
Also Read : Tirupati Accident : తిరుపతిలో తప్పిన ప్రమాదం

ఈ దృశ్యాలను ఓ వ్య‌క్తి వీడియో తీస్తుండ‌గా.. కొంద‌రు వ‌ర్క‌ర్లు కావాల‌ని.. ఇలా చేశారు. అప్ప‌టికే త‌యారు చేసి ఉంచిన టోస్టుల‌పై మురికిగా ఉన్న కాళ్లు పెట్ట‌డం, వాటి మీద ఉమ్మేయ‌డం, వాటిని నాకి ప్యాకింగ్ చేయ‌డం ఆ వీడియోలో చూడొచ్చు. కావాల‌ని వీడియో తీస్తున్నార‌ని తెలిసి కూడా వ‌ర్క‌ర్లు పిచ్చి చేష్ట‌లు చేస్తూ అటువంటి ప‌నులు చేయ‌డం నెటిజ‌న్ల‌కు కోపం తెప్పించింది. ఇటువంటి వాళ్ల‌ను అస్స‌లు వ‌ద‌ల‌కూడ‌దు. వాళ్ల‌ను వెంట‌నే అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తూ నెటిజన్లుకామెంట్ చేస్తున్నారు. దాదాపు 43,000 మంది ఈ వీడియోను చూశారు. వీరిచర్యలను ప్రతి ఒక్కరూ ఛీదరించుకుంటున్నారు.