IIT Kanpur Recruitment : కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే అభ్యర్థులు డిగ్రీ/పీజీ/ఎంఫిల్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పోస్టులను బట్టి వయస్సును నిబంధనల్లో పేర్కొన్నారు.

IIT Kanpur Recruitment : కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

IIT Kanpur Recruitment

IIT Kanpur Recruitment : భారతదేశంలోని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రతిష్టాత్మకమైన కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్/కాంట్రాక్ట్ ప్రాతిపదికన రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ కౌన్సెలర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు ఇతర ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Kattera Purugu Control : మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే అభ్యర్థులు డిగ్రీ/పీజీ/ఎంఫిల్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పోస్టులను బట్టి వయస్సును నిబంధనల్లో పేర్కొన్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి రిజిస్ట్రార్ 01, డిప్యూటీ రిజిస్ట్రార్ 05, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 05, అసిస్టెంట్ కౌన్సెలర్ 06, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 06, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 02
, హాల్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ 04, మెడికల్ ఆఫీసర్ 02, భద్రతా అధికారి 01, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ 08, జూనియర్ ఇంజనీర్ (సివిల్) 03 ఉన్నాయి.

READ ALSO : Intercrop In Cashew : జీడిమామిడిలో అంతర పంటగా పత్తిసాగు

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదిగా అక్టోబరు 16 , 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://oag.iitk.ac.in/ పరిశీలించగలరు.