Kattera Purugu Control : మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ
ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగిస్తారు. వర్షపాతం ఆశాజనకంగా ఉన్న ప్రాంతాల్లో ఖరీఫ్ లో వర్షాధారంగా మొక్కజొన్నను సాగు చేస్తున్నారు.

Control Of Cutworm
Kattera Purugu Control : తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న పంటకు కత్తెరపురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గత ఏడాది ఈ పురుగు దాడి వల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఖరీఫ్ లో వేసిన రైతులు మొక్క మొలిచిన దశనుండే కత్తెర పురుగు పట్ల చాలా జాగ్రత్త వహించాలి. ఈ పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్త మహేశ్.
READ ALSO : Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక
వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగిస్తారు. వర్షపాతం ఆశాజనకంగా ఉన్న ప్రాంతాల్లో ఖరీఫ్ లో వర్షాధారంగా మొక్కజొన్నను సాగు చేస్తున్నారు.
READ ALSO : Intercrops In Palm Oil : పామాయిల్ లో అంతర పంటలుగా కోకో, మిరియాల సాగు
ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఖరీఫ్ విస్తీర్ణం అధికంగా వుంది. ఇప్పటికే కొన్ని పంట చివరి దశకు చేరుకోగా, మరొకొన్ని చోట్ల కండెపోసుకునే దశలో ఉంది. అయితే గత ఏడాది తీవ్రంగా నష్టపరిచిన కత్తెర పురుగు ఈ సంవత్సరం కూడా ఆశించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చేలల్లో గుర్తించిన రైతులు వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్త మహేశ్