Flipkart-Amazon Independence Sale 2022: రేప‌టి నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫ‌ర్లు.. వీటిపై త‌గ్గింపు ధ‌ర‌లు

భార‌త‌ స్వాతంత్ర్య‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ-కామర్స్ సంస్థ‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు వంటివి కొనాల‌నుకుంటోన్న వారికి గుడ్‌న్యూస్‌. రేప‌టి నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫ‌ర్లు అందుబాటులో ఉండ‌నున్నాయి. అమెజాన్ లో ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న‌వారికైతే నేటి నుంచే ఆఫర్లు అందుబాటులోకి వ‌చ్చాయి. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్-2022 పేరుతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో ఈ ఆఫ‌ర్లు అందిస్తున్నాయి.

Flipkart-Amazon Independence Sale 2022: రేప‌టి నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫ‌ర్లు.. వీటిపై త‌గ్గింపు ధ‌ర‌లు

Flipkart-Amazon Independence Sale 2022: భార‌త‌ స్వాతంత్ర్య‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ-కామర్స్ సంస్థ‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు వంటివి కొనాల‌నుకుంటోన్న వారికి గుడ్‌న్యూస్‌. రేప‌టి నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫ‌ర్లు అందుబాటులో ఉండ‌నున్నాయి. అమెజాన్ లో ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న‌వారికైతే నేటి నుంచే ఆఫర్లు అందుబాటులోకి వ‌చ్చాయి. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్-2022 పేరుతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో ఈ ఆఫ‌ర్లు అందిస్తున్నాయి.

అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్-2022 ఈ నెల 10 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది. అంతేగాక‌, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారు 10 శాతం డిస్కౌంట్‌ను పొందే అవకాశం ఉంది. అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్-2022 ఆఫ‌ర్ల‌లో భాగంగా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, టీవీలు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు డిస్కౌంట్ ధరల‌కు ల‌భ్య‌మ‌వుతున్నాయి. స్మార్ట్ టీవీలపై 50 శాతం వ‌ర‌కు డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.

పొకొ, శాంసంగ్‌, రియల్‌మీ, మోటొరొలా, గూగుల్, ఆపిల్, ఒప్పొ స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు త‌గ్గింపు ధ‌ర‌లు ఉన్నాయి. వ‌న్ ప్లస్ నార్డ్ 2టీ 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.28,999కే కొనుగోలు చేయొచ్చు. రెడ్‌మీ కే50ఐ 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.25,999కు అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ రూ.24,999 (అస‌లు ధ‌ర రూ.26,499)కే లభిస్తుంది. అలాగే, రూ.49 నుంచే మొబైల్ ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి. బోట్ ఎయిర్‌డోప్స్ 181 వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు రూ.1,299కే ల‌భ్య‌మ‌వుతున్నాయి.

వన్‌ప్లస్ 50 అంగుళాల 4కే ఆండ్రాయిడ్ టీవీ రూ.38,999కు అందుబాటులో ఉంది. లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 ల్యాప్‌టాప్ రూ.32,990కే కొనుగోలు చేయొచ్చు. మ‌రోవైపు, గృహోపకరణ ఉత్పత్తులపై 60 శాతం వరకు డిస్కౌంట్ ల‌భిస్తోంది. ఇవేకాక‌, ఎక్స్‌ఛేంజ్, క్యాష్ బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ వంటి అవ‌కాశాలు ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్ రేప‌టి నుంచి ఈ నెల 10 వ‌ర‌కు బిగ్ సేవింగ్ డేస్ పేరుతో ఆఫ‌ర్లు ఇవ్వ‌నుంది. ఐసీఐసీఐ, కొటక్ బ్యాంకుల‌ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటు ఉంది. టీవీలు, ఇత‌ర ఉపకరణాలపై 75 శాతం వరకు డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. శాంసంగ్, రియ‌ల్‌మీ, షియోమీతో పాటు ప‌లు సంస్థ‌ల‌ టీవీల‌పై ఈ ఆఫర్ పొంద‌వ‌చ్చు. ఇక‌, ఏసీలపై 55 శాతం, మైక్రో వేవ్స్‌పై 45 శాతం రాయితీ పొందొచ్చు. మ‌రిన్ని వివ‌రాల‌కు ఫ్లిప్ కార్ట్ వెబ్‌సైట్ చూడొచ్చు.

China: తైవాన్ విష‌యంలో ఉద్రిక్త‌త‌ల వేళ చైనాకు అమెరికా వార్నింగ్