China: తైవాన్ విష‌యంలో ఉద్రిక్త‌త‌ల వేళ చైనాకు అమెరికా వార్నింగ్

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సల్లీవన్‌ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... చైనా చ‌ర్య‌లు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయ‌ని విమ‌ర్శించారు. ప్ర‌స్తుతం నెల‌కొన్న ఉద్రిక్త‌త వ‌ల్ల‌ ప‌రిస్థితులు చేజారిపోయే ముప్పు ఉంద‌ని చెప్పారు. క్షిప‌ణి ప‌రీక్షలు, సైనిక విన్యాసాలు, యుద్ధ విమానాలు చ‌క్క‌ర్లు కొట్ట‌డం, స‌ముద్రంలో యుద్ధ నౌక‌ల క‌ద‌లిక‌లు వంటివి చోటుచేసుకుంటే ఏదో ప్ర‌మాద‌క‌ర ఘ‌ట‌న‌ జ‌ర‌గ‌బోతుంద‌నే చెప్పుకోవాల‌ని అన్నారు. ఉద్రిక్త‌త‌లు త‌గ్గించేందుకు కృషి చేయాల‌ని చైనాను కోరారు.

China: తైవాన్ విష‌యంలో ఉద్రిక్త‌త‌ల వేళ చైనాకు అమెరికా వార్నింగ్

China: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌లో ప‌ర్య‌టించ‌డంతో డ్రాగ‌న్ కంట్రీ స‌ముద్ర జ‌లాల్లోని ఆరు ప్రాంతాల్లో విధ్వంసకర సైనిక విన్యాసాలు చేప‌డుతుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. దీనిపై అమెరికా స్పందిస్తూ చైనాకు వార్నింగ్ ఇచ్చింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సల్లీవన్‌ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ… చైనా చ‌ర్య‌లు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయ‌ని విమ‌ర్శించారు. ప్ర‌స్తుతం నెల‌కొన్న ఉద్రిక్త‌త వ‌ల్ల‌ ప‌రిస్థితులు చేజారిపోయే ముప్పు ఉంద‌ని చెప్పారు.

క్షిప‌ణి ప‌రీక్షలు, సైనిక విన్యాసాలు, యుద్ధ విమానాలు చ‌క్క‌ర్లు కొట్ట‌డం, స‌ముద్రంలో యుద్ధ నౌక‌ల క‌ద‌లిక‌లు వంటివి చోటుచేసుకుంటే ఏదో ప్ర‌మాద‌క‌ర ఘ‌ట‌న‌ జ‌ర‌గ‌బోతుంద‌నే చెప్పుకోవాల‌ని అన్నారు. ఉద్రిక్త‌త‌లు త‌గ్గించేందుకు కృషి చేయాల‌ని చైనాను కోరారు. నాన్సీ పెలోసీ తైవాన్‌లో ప‌ర్య‌టిస్తే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని చైనా ప‌లుసార్లు హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే.

అయిన‌ప్ప‌టికీ ఆమె తైవాన్‌లో ప‌ర్య‌టించ‌డంతో చైనా తీవ్ర ఆగ్ర‌హంతో ఊగిపోతోంది. తైవాన్‌ చూట్టూ మొత్తం ఆరు ప్రాంతాల్లో విధ్వంసకర సైనిక విన్యాసాలను చేప‌ట్టింది. చైనా దాడి చేస్తే వెంట‌నే తిప్పికొట్టాల‌ని తైవాన్ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. చైనా ఏదైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని తైవాన్ అంటోంది.

COVID19: దేశంలో కొత్త‌గా 19,893 క‌రోనా కేసులు