COVID19: దేశంలో కొత్త‌గా 19,893 క‌రోనా కేసులు

దేశంలో కొత్త‌గా 19,893 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 1,36,478గా ఉన్నాయ‌ని పేర్కొంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 4,40,87,037కి పెరిగింద‌ని వివ‌రించింది. దేశంలో క‌రోనాతో నిన్న‌ 53 మంది ప్రాణాలు కోల్పోయార‌ని పేర్కొంది. గ‌త 24 గంట‌ల్లో 20,419 మంది క‌రోనా నుంచి కోలుకున్నార‌ని చెప్పింది.

COVID19: దేశంలో కొత్త‌గా 19,893 క‌రోనా కేసులు

Covid Vaccine

COVID19: దేశంలో కొత్త‌గా 19,893 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 1,36,478గా ఉన్నాయ‌ని పేర్కొంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 4,40,87,037కి పెరిగింద‌ని వివ‌రించింది. దేశంలో క‌రోనాతో నిన్న‌ 53 మంది ప్రాణాలు కోల్పోయార‌ని పేర్కొంది. గ‌త 24 గంట‌ల్లో 20,419 మంది క‌రోనా నుంచి కోలుకున్నార‌ని చెప్పింది.

క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,34,24,029కు చేరింద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివ‌రించింది. క‌రోనా మృతుల సంఖ్య మొత్తం 5,26,530కు పెరిగింద‌ని తెలిపింది. క‌రోనా రిక‌వ‌రీ రేటు 98.50 శాతానికి పెరిగింద‌ని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.94 శాతంగా, వారాంత‌పు పాజిటివిటీ రేటు 4.64 శాతంగా ఉంద‌ని పేర్కొంది. నిన్న దేశంలో 4,03,006 క‌రోనా ప‌రీక్ష‌లు చేశార‌ని తెలిపింది.

ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 87.67 కోట్ల క‌రోనా ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 205.22 కోట్ల క‌రోనా వ్యాక్సిన్ డోసులు వాడారని తెలిపింది. వాటిలో రెండో డోసులు 93.40 కోట్లు, బూస్ట‌ర్ డోసులు 9.80 కోట్లు ఉన్నాయని పేర్కొంది. గ‌త 24 గంట‌ల్లో 38,20,676 క‌రోనా వ్యాక్సిన్ డోసులు వేశార‌ని తెలిపింది.