Diabetes : ఈ ఆహారాలు డయాబెటిస్ ను అదుపులో ఉంచుతాయట ! అవేంటో తెలుసా ?

నేరేడు సీజనల్ పండ్లు. వీటిలో హైపోగ్లైసిమిక్ ప్రభావాలు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో ఆంథోసైనిన్స్, ఎలాజిక్ యాసిడ్, పాలిఫెనాల్స్ వంటి బయో యాక్టివ్ సమ్మేళనాలు మధుమేహులకు మేలు కలిగిస్తాయి.

Diabetes : ఈ ఆహారాలు డయాబెటిస్ ను అదుపులో ఉంచుతాయట ! అవేంటో తెలుసా ?

foods keep diabetes

Diabetes : శరీర బరువు, ఒత్తిడి,జన్యుశాస్త్రం వంటి అంశాలు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నప్పటికీ, రక్తంలో చక్కెర నిర్వహణకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని రోజువారిగా తీసుకోవటం చాలా కీలకమని నిపుణులు చెబుతున్నారు. చక్కెర మరియు శుద్ధి చేసిన పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాలతో సహా కొన్ని ఆహారాలు రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. మరికొన్ని మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతాయి.

READ ALSO : Cheetah Kill Girl : తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి చేసి చంపేసిన చిరుత

డయాబెటిస్ అనే ఈ దీర్ఘకాలిక జీవక్రియ వ్యాధితో ప్రపంచంలో లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం కొన్ని రకాల ఆహారాలు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచటానికి సహాయపడతాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే ఆహారాలు ;

బ్రోకలి ; సల్ఫోరాఫేన్ అనేది రక్తంలో చక్కెరను తగ్గించే లక్షణాలను కలిగి ఉన్న ఐసోథియోసైనేట్ రకం. బ్రోకలీని తరిగినప్పుడు లేదా నమలినప్పుడు ఈ మొక్క రసాయనం ప్రతిచర్య ద్వారా ఉత్పత్తి అవుతుంది. సల్ఫోరాఫేన్ బ్రోకలీ సారం శక్తివంతమైన యాంటీడయాబెటిక్ ప్రభావాలను కలిగి ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.

బ్రోకలీలోని గ్లూకోరాఫానిన్ వంటి గ్లూకోసినోలేట్‌ల మూలాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గించటంలో సహాయపడతాయట. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో తోడ్పడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ క్రూసిఫరస్ కూరగాయలను తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

READ ALSO : Eat Sweet Corn : మొక్కజొన్న తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయా ?

కాకరకాయ ; కాకర చేదుగా ఉన్నప్పటికీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలి ఉంటుంది. కాకరలో ఉండే యాంటీ డయాబెటిక్ లక్షణాలు మదుహేహులకు మేలు చేస్తాయి. కాకరలో పాలీపెప్టైడ్-పి అనే ఇన్సులిన్ లాంటి సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి తోడ్పడుతుంది. గ్లూకోజ్ వినియోగాన్ని మెరుగుపరచడంతో పాటు ఇన్సులిన్ హార్మోనును ఉత్పత్తి అయ్యేలా ఉత్తేజపరచటంలో సహాయకారిగా పనిచేస్తుంది..

సీ ఫుడ్స్ ; చేపలు వంటి సీఫుడ్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు , యాంటీఆక్సిడెంట్‌లకు మూలం, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర నిర్వహణకు ప్రోటీన్ అవసరం. ఇది నెమ్మదిగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది, భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది. శరీరంలో అధనంగా ఉన్న కొవ్వును కరిగించేందుకు తోడ్పడతాయి. సాల్మన్, సార్డినెస్ వంటి కొవ్వు చేపలను ఎక్కువగా తీసుకోవడం రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడుతుందని అధ్యయనాల్లో తేలింది.

READ ALSO : Control Blood Sugar in Summer : వేసవిలో బ్లడ్ షుగర్‌ని నియంత్రించడానికి తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారాలు !

నేరేడు పండ్లు ; నేరేడు సీజనల్ పండ్లు. వీటిలో హైపోగ్లైసిమిక్ ప్రభావాలు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో ఆంథోసైనిన్స్, ఎలాజిక్ యాసిడ్, పాలిఫెనాల్స్ వంటి బయో యాక్టివ్ సమ్మేళనాలు మధుమేహులకు మేలు కలిగిస్తాయి. నేరేడు పండ్లను నేరుగా లేదా రసం తీసుకుని తాగినా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవుతుంది. వీటిలోని డైటరీ ఫైబర్ శరీరం చక్కెరను శోషించుకోకుండా అడ్డుకుంటుంది.

READ ALSO : Blood Sugar And Cholesterol : రక్తంలో షుగర్ లెవల్స్ , కొలెస్ట్రాల్ తగ్గాలంటే వీటిని తీసుకోండి !

ఉసిరి ; ఉసిరికాయలను రోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ప్యాంక్రియాటిక్ పనితీరును బాగా ఉండేలా చూస్తాయి. రక్తంలో చక్కెర నియంత్రణ ఉంచటంతోపాటు, ఉసిరి ఆక్సికరణ ఒత్తిడిని, వాపును తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తుంది.

తిప్పతీగ ; తిప్పతీగా ఒక తీగ జాతి మొక్క. ఈ మొక్క ఆకుల రసాన్ని తాగడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంచుకోవచ్చు. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది. తిప్పతీగలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణం ప్యాంక్రియాటిక్ బీటా కణాలను రక్షించేందుకు సహాయపడతుంది. మధుమేహంతో సంబంధం ఉన్న ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవటంలో దోహదం చేస్తుంది.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకిరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.