Rahul Gandh detained by police: రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రియాంకా గాంధీ ధ‌ర్నా

దేశంలో పెరిగిన నిరుద్యోగం, ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై ఆందోళ‌న‌కు దిగిన‌ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతో పాటు ప‌లువురు నేత‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌ధాన మంత్రి హౌస్ ఘెరావ్ పేరిట పార్ల‌మెంటు నుంచి రాష్ట్రప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు ఎంపీలు ర్యాలీ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రాహుల్ గాంధీతో పాటు శ‌శి థ‌రూర్‌, ఇత‌ర నేత‌ల‌ను పోలీసులు అడ్డుకోవ‌డంతో కాసేపు ఉద్రిక్త‌త నెల‌కొంది. మ‌రోవైపు, ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాల‌యం ముందు కూర్చొని కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంకా గాంధీ ధ‌ర్నాకు దిగారు.

Rahul Gandh detained by police: రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రియాంకా గాంధీ ధ‌ర్నా

Rahul Gandh detained by police

Rahul Gandh detained by police: దేశంలో పెరిగిన నిరుద్యోగం, ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై ఆందోళ‌న‌కు దిగిన‌ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతో పాటు ప‌లువురు నేత‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌ధాన మంత్రి హౌస్ ఘెరావ్ పేరిట పార్ల‌మెంటు నుంచి రాష్ట్రప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు ఎంపీలు ర్యాలీ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రాహుల్ గాంధీతో పాటు శ‌శి థ‌రూర్‌, ఇత‌ర నేత‌ల‌ను పోలీసులు అడ్డుకోవ‌డంతో కాసేపు ఉద్రిక్త‌త నెల‌కొంది.

ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై గ‌ళం విప్ప‌డం త‌మ క‌ర్త‌వ్య‌మ‌ని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రప‌తి భ‌వ‌న్‌కు వెళ్తున్న‌ కొంద‌రు ఎంపీల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నార‌ని, కొట్టారని ఆయ‌న మ‌రోసారి చెప్పారు. ద్ర‌వ్యోల్బ‌ణం, ధ‌ర‌ల పెరుగుద‌ల‌, నిరుద్యోగం, జీఎస్టీ రేట్ల పెరుగుద‌ల‌పై శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతుంటే అడ్డుకుంటున్నార‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే అన్నారు.

మ‌రోవైపు, ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాల‌యం ముందు కూర్చొని కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంకా గాంధీ ధ‌ర్నాకు దిగారు. దీంతో ఆమెను కూడా అక్క‌డి నుంచి త‌ర‌లించేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త‌త నెల‌కొంది. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేత‌లు మండిప‌డుతున్నారు. ప‌లు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియ‌ర్ నేత‌లు ఆందోళ‌న‌ల్లో పాల్గొంటున్నారు.


China Taiwan Tension: తైవాన్‌కు వెళ్ళ‌కుండా మ‌మ్మ‌ల్ని అడ్డుకోలేరు: నాన్సీ ఫెలోసీ