China Taiwan Tension: తైవాన్‌కు వెళ్ళ‌కుండా మ‌మ్మ‌ల్ని అడ్డుకోలేరు: నాన్సీ ఫెలోసీ

తైవాన్‌ను చైనా ఎప్ప‌టికీ ఒంట‌రి చేయ‌లేద‌ని, ఆ దేశానికి వెళ్ళ‌కుండా త‌మ‌ను అడ్డుకోలేద‌ని అమెరికా ప్ర‌తినిధుల స‌భ స్పీక‌ర్ నాన్సీ ఫెలోసీ అన్నారు. చైనా హెచ్చ‌రిక‌లు చేసిన‌ప్ప‌టికీ ఇటీవ‌లే తైవాన్‌లో ఆమె ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. ఆమె ఇవాళ జ‌పాన్‌లో మాట్లాడుతూ.. చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌తో అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ మాట్లాడార‌ని చెప్పారు. అమెరికా-చైనా రెండు పెద్ద దేశాల‌ని, సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డం అవ‌స‌ర‌మ‌ని తెలిపారు.

China Taiwan Tension: తైవాన్‌కు వెళ్ళ‌కుండా మ‌మ్మ‌ల్ని అడ్డుకోలేరు: నాన్సీ ఫెలోసీ

China Taiwan Tension

China Taiwan Tension: తైవాన్‌ను చైనా ఎప్ప‌టికీ ఒంట‌రి చేయ‌లేద‌ని, ఆ దేశానికి వెళ్ళ‌కుండా త‌మ‌ను అడ్డుకోలేద‌ని అమెరికా ప్ర‌తినిధుల స‌భ స్పీక‌ర్ నాన్సీ ఫెలోసీ అన్నారు. చైనా హెచ్చ‌రిక‌లు చేసిన‌ప్ప‌టికీ ఇటీవ‌లే తైవాన్‌లో ఆమె ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. ఆమె ఇవాళ జ‌పాన్‌లో మాట్లాడుతూ.. చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌తో అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ మాట్లాడార‌ని చెప్పారు. అమెరికా-చైనా రెండు పెద్ద దేశాల‌ని, సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డం అవ‌స‌ర‌మ‌ని తెలిపారు.

వాణిజ్య ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకుని ఒకవేళ‌ చైనాలో మాన‌వ హ‌క్కుల గురించి తాము మాట్లాడ‌క‌పోతే నైతిక అధికారాన్ని కోల్పోతామ‌ని, ప్రపంచంలో ఇంకా ఎక్క‌డా మాన‌వ హక్కుల గురించి మాట్లాడ‌లేమ‌ని ఆమె చెప్పారు. కాగా, నాన్సీ పెలోసీ తైవాన్‌లో ప‌ర్య‌టించ‌డంతో చైనా ఆగ్ర‌హంతో ఊగిపోతోంది. తైవాన్ చుట్టూ స‌ముద్ర జ‌లాల్లోని ఆరు ప్రాంతాల్లో విధ్వంసకర సైనిక విన్యాసాలు చేప‌డుతోంది.

చైనా చ‌ర్య‌లు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయ‌ని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సల్లీవన్ కూడా అన్నారు. మ‌రోవైపు, చైనా దాడి చేస్తే తిప్పికొట్టాల‌ని తైవాన్ న్ని ఏర్పాట్లు చేసుకుంది. స‌రిహ‌ద్దుల వ‌ద్ద సైన్యాన్ని అప్ర‌మ‌త్తం చేసింది.

China: తైవాన్ విష‌యంలో ఉద్రిక్త‌త‌ల వేళ చైనాకు అమెరికా వార్నింగ్