Pakistan: ఇమ్రాన్ ఖాన్ హ‌త్య‌కు కుట్ర ప‌న్నారంటూ వదంతులు.. ఇస్లామాబాద్‌లో హై అల‌ర్ట్

ఈ సంద‌ర్భంగా ఇమ్రాన్ బంధువు హ‌స్సాన్ నియాజీ మీడియాతో మాట్లాడుతూ... ఇమ్రాన్ ఖాన్‌ను ఏదైనా జ‌రిగితే, దాన్ని పాకిస్థాన్‌పై జ‌రిగిన దాడిగా ప‌రిగ‌ణిస్తామ‌ని అన్నారు.

Pakistan: ఇమ్రాన్ ఖాన్ హ‌త్య‌కు కుట్ర ప‌న్నారంటూ వదంతులు.. ఇస్లామాబాద్‌లో హై అల‌ర్ట్

Imran Khan's speeches

Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హ‌త్య‌కు కొందరు కుట్ర ప‌న్నారంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇస్లామాబాద్‌లోని బానీగాలాలో పోలీసులు హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే ఇస్లామాబాద్‌లో 144 సెక్ష‌న్ విధించామ‌ని పోలీసులు వివ‌రించారు. ఇస్లామాబాద్‌లో ఎక్క‌డా జ‌న స‌మూహాలు క‌న‌ప‌డ‌కూడ‌ద‌ని చెప్పారు. ఇస్లామాబాద్‌లోని బానీగాలాలోని త‌న ఇంటికి ఇమ్రాన్ ఖాన్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు చెప్పారు.

North Korea: 8 ఖండాంత‌ర క్షిప‌ణుల‌ను ప‌రీక్షించి మ‌రోసారి క‌ల‌క‌లం రేపిన ఉత్త‌ర‌కొరియా

అయితే, ఈ విష‌యంపై ఇమ్రాన్ సిబ్బంది ఇప్ప‌టివ‌ర‌కు త‌మ‌కు ఎటువంటి స‌మాచారం ఇవ్వ‌లేద‌ని పోలీసులు అన్నారు. ఇమ్రాన్‌కు ఇస్లామాబాద్ పోలీసులు పూర్తిస్థాయిలో భ‌ద్ర‌త క‌ల్పిస్తార‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఇమ్రాన్ బంధువు హ‌స్సాన్ నియాజీ మీడియాతో మాట్లాడుతూ… ఇమ్రాన్ ఖాన్‌ను ఏదైనా జ‌రిగితే, దాన్ని పాకిస్థాన్‌పై జ‌రిగిన దాడిగా ప‌రిగ‌ణిస్తామ‌ని అన్నారు. ఇమ్రాన్ ఆదివారం ఇస్లామాబాద్‌కు వ‌స్తార‌ని ఇప్ప‌టికే పీటీఐ పార్టీ ఛైర్మ‌న్ ఫ‌వాద్ చెప్పారు. ఆయ‌న‌ను హ‌త్య చేసేందుకు కొందరు కుట్ర‌లు ప‌న్నార‌ని త‌మ‌కు పాక్‌ ఇంటెలిజ‌న్స్ వ‌ర్గాలు చెప్పాయ‌ని వివ‌రించారు.

Delhi: ఏడేళ్లుగా మూగ‌బోయిన బాలుడి గొంతు.. అరుదైన శస్త్ర‌చికిత్సతో మాట తెప్పించిన వైద్యులు

‘దేశాన్ని అమ్మేసేందుకు’ ఇమ్రాన్ తిర‌స్క‌రించ‌డంతోనే కొంద‌రు ఆయ‌న‌ను చంపేయాల‌ని చూస్తున్నార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఆయ‌న ప్రాణాలకు ముప్పు ఉంద‌ని చెప్పారు. ఇస్లామాబాద్‌లోని ప‌రేడ్ గ్రౌండ్‌లో ఇమ్రాన్ ర్యాలీ నేప‌థ్యంలో బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ వాడాల‌ని కొంద‌రు సూచించార‌ని తెలిపారు. కాగా, త‌న‌ను హ‌త్య చేసేందుకు పాక్‌తో పాటు విదేశీయులూ కుట్ర‌లు ప‌న్నార‌ని ఇటీవ‌ల ఇమ్రాన్ ఖాన్ కూడా ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో తాను ఓ వీడియో రికార్డు చేశాన‌ని, దాన్ని ఓ చోట భ‌ద్ర‌ప‌రిచాన‌ని చెప్పారు. ఒక‌వేళ త‌న‌కు ఏమైనా జ‌రిగితే ఆ వీడియో ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తుంద‌ని చెప్పుకొచ్చారు. త‌న‌ను చంప‌డానికి కుట్ర ప‌న్నిన ప్ర‌తి ఒక్క‌రి వివ‌రాలు అందులో తెలిపాన‌ని అన్నారు.