Delhi: ఏడేళ్లుగా మూగ‌బోయిన బాలుడి గొంతు.. అరుదైన శస్త్ర‌చికిత్సతో మాట తెప్పించిన వైద్యులు

ఆ బాలుడి వ‌య‌సు 13 ఏళ్లు. దాదాపు ప‌దేళ్లుగా ట్రాకియోస్టోమీ ట్యూబ్ సాయంతో శ్వాస తీసుకుంటూ బ‌తుకుతున్నాడు. దీంతో అత‌డు దాదాపు ఏడేళ్ల నుంచి మాట్లాడ‌లేక‌పోయాడు. ఆ బాలుడికి తాజాగా ఢిల్లీలోని గంగారాం ఆసుప‌త్రి వైద్యులు క్లిష్ట‌మైన శ‌స్త్ర‌చికిత్సను విజ‌య‌వంతంగా చేశారు.

Delhi: ఏడేళ్లుగా మూగ‌బోయిన బాలుడి గొంతు.. అరుదైన శస్త్ర‌చికిత్సతో మాట తెప్పించిన వైద్యులు

Surgery Doctors

Delhi: ఆ బాలుడి వ‌య‌సు 13 ఏళ్లు. దాదాపు ప‌దేళ్లుగా ట్రాకియోస్టోమీ ట్యూబ్ సాయంతో శ్వాస తీసుకుంటూ బ‌తుకుతున్నాడు. దీంతో అత‌డు దాదాపు ఏడేళ్ల నుంచి మాట్లాడ‌లేక‌పోయాడు. ఆ బాలుడికి తాజాగా ఢిల్లీలోని గంగారాం ఆసుప‌త్రి వైద్యులు క్లిష్ట‌మైన శ‌స్త్ర‌చికిత్సను విజ‌య‌వంతంగా చేశారు. దీంతో ఆ బాలుడు ఇప్పుడు మాట్లాడ‌గ‌లుగుతున్నాడు. వైద్య రంగంలోనే ఇదో అద్భుత‌మ‌ని వైద్యులు అంటున్నారు. ఆ బాలుడికి చేసిన చికిత్స గురించి వివ‌రించి చెప్పారు.

Uttar Pradesh Violence: రాష్ట్రప‌తి, ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న రోజే హింస జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌రం: మాయావ‌తి

శ్రీ‌కాంత్ అనే బాలుడి త‌ల‌కి బ‌ల‌మైన గాయం కావ‌డంతో అత‌డు చాలా కాలంగా వెంటిలేట‌ర్‌పైనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు. చాలా కాలం పాటు వెంటిలేట‌ర్‌పై ఉండ‌డంతో అత‌డి శ్వాస‌నాళ‌ము ముడుచుకుపోయింది. దీంతో అతడి గొంతు నుంచి వైద్యులు రంధ్రము చేసి ట్రాకియోస్టోమీ ట్యూబ్‌ను అమ‌ర్చారు. ట్రాకియోస్టోమీని కూడా చాలా కాలం వాడ‌డంతో ఆ బాలుడు సాధార‌ణంగా గొంతులోని వాయుమార్గం ద్వారా శ్వాస‌ను పీల్చ‌లేక‌పోయాడు. అత‌డికి పైపు ద్వారానే వైద్యులు ఆహారం అందిస్తున్నారు.

Uttar Pradesh Violence: యూపీలో హింస్మాత‌క ఘ‌ట‌న కేసు.. 36 మంది అరెస్టు

అలాగే, శ్రీకాంత్ గ‌త ఏడేళ్లుగా మాట్లాడ‌లేని పరిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఆ బాలుడికి చాలా క్లిష్ట‌మైన ఓ శ‌స్త్ర‌చిక‌త్స చేయాల‌ని వైద్యులు భావించారు. త‌న 15 ఏళ్ల‌ వైద్య రంగ అనుభ‌వంలోనే ఇటువంటి కేసును చూడ‌లేద‌ని ఈఎన్‌టీ సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ డాక్ట‌ర్ మ‌నీశ్ ముంజాల్ చెప్పారు. ఆ బాలుడి శ్వాస‌నాళ‌ం 100 శాతం బ్లాక్ అయిపోయిన ఉంద‌ని తెలిపారు. ఆ బాలుడిని ప‌రీక్షించి శ‌స్త్ర‌చికిత్స చేయ‌డానికి థొరాసిక్ స‌ర్జ‌రీ విభాగం నుంచి ఆసుప‌త్రి ఓ వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది.

Asaduddin Owaisi: మోహ‌న్ భ‌గ‌వ‌త్ కాదు.. మోదీ భ‌రోసా ఇవ్వాలి: అస‌దుద్దీన్ ఒవైసీ

ఆ బృందంలో ఈఎన్‌టీ వైద్యుల‌తో పాటు పిల్ల‌ల అత్య‌వ‌స‌ర విభాగ, అన‌స్థీషియా నిపుణులు ఉన్నారు. బాలుడికి ఇబ్బంది క‌ల‌గ‌కుండా శ్వాస‌నాళాన్ని విచ్ఛేదం చేసే పూర్తి ప్ర‌క్రియ‌ను కొనసాగించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు వైద్యులు చెప్పారు. ఇది చాలా క‌ష్ట‌మైన స‌ర్జ‌రీ అని, విఫ‌ల‌మ‌య్యే ప్ర‌మాదాలే అధికంగా ఉంటాయ‌ని, ఒక్క‌సారి రోగి ప్రాణాలు కోల్పోయే ముప్పు కూడా ఉంటుంద‌ని అన్నారు. అయితే, ఆ బాలుడిని ర‌క్షించేందుకు త‌మ ముందు ఇత‌ర ఏ మార్గ‌మూ లేద‌ని, ఈ విష‌యాన్ని అత‌డి కుటుంబ స‌భ్యుల‌కు వివ‌రించి చెప్పామ‌ని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న ఆ బాలుడిని ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లోకి తీసుకొచ్చామ‌ని వివ‌రించారు. ఆరున్న‌ర గంట‌ల పాటు క‌ష్ట‌ప‌డి శ‌స్త్ర‌చికిత్స చేశామ‌ని తెలిపారు.

Kerala: కేర‌ళ‌లోని 3 జిల్లాల్లో క‌రోనా కేసుల విజృంభ‌ణ‌

ఆ బాలుడి గొంతు నుంచి ఊపిరితిత్తుల‌కు శ్వాస వెళ్లే నాలుగు సెంటీమీట‌ర్ల‌ వాయునాళానికి మొద‌ట శ‌స్త్ర‌చికిత్స చేశామ‌ని వివ‌రించారు. స్వ‌ర‌పేటికలోని వాయునాళానికి శ‌స్త్ర‌చికిత్స అనుకున్న ప్ర‌కారం విజ‌య‌వంతంగా పూర్త‌యింద‌ని అన్నారు. స్వ‌ర‌పేటిక కింది భాగంలో బ్లాక్ అయిపోయిన ఎముక‌కు శ‌స్త్ర‌చిక‌త్స చేయ‌డం చాలా క‌ష్ట‌త‌రమ‌ని, అది వ‌ల‌యాకారంలో ఉంటుంద‌ని చెప్పారు. దాన్ని వైద్య‌రంగ‌ డ్రిల్స్ వ్య‌వ‌స్థ‌ను వాడి స‌రిచేశామ‌ని తెలిపారు. చివ‌ర‌కు ఈ శ‌స్త్ర‌చికిత్స విజ‌యవంతం కావ‌డంతో అత‌డిని కొన్ని రోజు ఐసీయూలోనే త‌మ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంచామ‌ని చెప్పారు. ఇప్పుడు ఆ బాలుడు డిశ్చార్జ్ అయ్యాడ‌ని, అత‌డి ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని తెలిపారు.