Kerala: కేర‌ళ‌లోని 3 జిల్లాల్లో క‌రోనా కేసుల విజృంభ‌ణ‌

కేర‌ళ‌లోని ఎర్నాకుళం, తిరువ‌నంత‌పురం, కొట్టాయంలో క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే, దీనిపై అంత‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేద‌ని కేర‌ళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి అన్నారు.

Kerala: కేర‌ళ‌లోని 3 జిల్లాల్లో క‌రోనా కేసుల విజృంభ‌ణ‌

COVID 19

Kerala: కేర‌ళ‌లోని ఎర్నాకుళం, తిరువ‌నంత‌పురం, కొట్టాయంలో క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే, దీనిపై అంత‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేద‌ని కేర‌ళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి అన్నారు. తాజాగా, క‌రోనాపై ఉన్న‌త‌స్థాయి స‌మావేశంలో నిర్వ‌హించిన వీణా జార్జి ఈ సంద‌ర్భంగా మాట్లాడారు. కేర‌ళ వ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయ‌ని, అయితే ఆ కేసుల‌న్నీ ఒమిక్రాన్ వేరియంట్ల‌వేన‌ని తెలిపారు. ఇత‌ర ప్రాంతాల‌తో పోల్చితే కేర‌ళ‌లోని ఎర్నాకుళం, తిరువ‌నంత‌పురం, కొట్టాయం జిల్లాల్లోనే కేసులు అధికంగా ఉన్నాయ‌ని వివ‌రించారు.

Tiananmen Massacre: చ‌రిత్ర‌ను చెరిపేసేందుకు చైనా ప్ర‌య‌త్నిస్తోంది: అమెరికా

ఆయా జిల్లాల‌పై ప్ర‌త్యేక దృష్టిసారిస్తామ‌ని ఆమె చెప్పారు. క‌రోనా ల‌క్ష‌ణాలతో బాధ‌ప‌డుతోన్న వారికి త‌ప్ప‌కుండా ప‌రీక్ష‌లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని చెప్పారు. రెండో డోసు తీసుకున్న వారికి ప్రికాష‌న్ డోసు వేయాలని ఆమె సూచించారు. రాష్ట్రంలో క‌రోనా జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను త‌ప్ప‌కుండా పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాలని సూచించారు.

Uttar Pradesh Violence: యూపీలో హింస్మాత‌క ఘ‌ట‌న కేసు.. 36 మంది అరెస్టు

కాగా, కేర‌ళ‌లో శుక్ర‌వారం 734 కొత్త‌ కేసులు న‌మోద‌య్యాయి. ఆ రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య 6,990కి చేరింది. ఎర్నాకుళంలో మే 27 నుంచి జూన్ 3 మ‌ధ్‌య మొత్తం 2,063 కేసులు నిర్థార‌ణ అయ్యాయి. కేసులు పెరుగుతుండ‌డంతో త‌గు చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఇప్ప‌టికే కేర‌ళ‌తో పాటు మ‌రో నాలుగు రాష్ట్రాల‌కు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లేఖలు రాసింది.