Tiananmen Massacre: చ‌రిత్ర‌ను చెరిపేసేందుకు చైనా ప్ర‌య‌త్నిస్తోంది: అమెరికా

చైనా చ‌రిత్ర‌ను చెరిపేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని, మాన‌వ హ‌క్కుల‌కే ముప్పు వాటిల్లేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అమెరికా మండిప‌డింది. తియానన్మెన్ స్క్వేర్‌ (తియాన్మెన్) దారుణ‌ ఘ‌టన జ‌రిగి 33 ఏళ్లు అవుతున్న నేప‌థ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఓ ప్ర‌క‌ట‌న‌లో చైనా తీరును ఎండ‌గట్టారు.

Tiananmen Massacre: చ‌రిత్ర‌ను చెరిపేసేందుకు చైనా ప్ర‌య‌త్నిస్తోంది: అమెరికా

Tiananmensquare

Tiananmen Massacre: చైనా చ‌రిత్ర‌ను చెరిపేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని, మాన‌వ హ‌క్కుల‌కే ముప్పు వాటిల్లేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అమెరికా మండిప‌డింది. తియానన్మెన్ స్క్వేర్‌ (తియాన్మెన్) దారుణ‌ ఘ‌టన జ‌రిగి 33 ఏళ్లు అవుతున్న నేప‌థ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఓ ప్ర‌క‌ట‌న‌లో చైనా తీరును ఎండ‌గట్టారు. చైనా చ‌రిత్ర‌ను చెరిపే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ, అమెరికా మాత్రం మాన‌వ హ‌క్కులకు ఎక్క‌డ భంగం క‌లుగుతుందో అక్క‌డ వాటి ప‌రిర‌క్ష‌ణ కోసం ప‌నిచేస్తూనే ఉంటుంద‌ని బ్లింకెన్ అన్నారు.

Uttar Pradesh Violence: యూపీలో హింస్మాత‌క ఘ‌ట‌న కేసు.. 36 మంది అరెస్టు

ప్ర‌జాస్వామ్యం కోసం తియానన్మెన్ స్క్వేర్ వ‌ద్ద ప్ర‌జ‌లు చాలా ధైర్యంగా, శాంతియుతంగా నిర‌స‌న తెలిపార‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఈ నిర‌స‌న‌ ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగి 33 ఏళ్లు అవుతుంద‌ని చెప్పారు. అయితే, తియానన్మెన్ స్మారక చిహ్నాలు లేకుండా చేసేందుకు చైనా ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. కాగా, 1989లో తియానన్మెన్ స్క్వేర్ మార‌ణ‌కాండ జ‌రిగింది.

Kashmiri Pandits: క‌శ్మీరీ పండిట్ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లింపు!

దేశంలో భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ ఉండాల‌ని, ప్ర‌భుత్వం జ‌వాబుదారీత‌నంతో వ్య‌వ‌హ‌రించాల‌ని, అవినీతిని రూపుమాపాల‌ని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, కార్మికులు, ఇత‌ర వ‌ర్గాల వారు పెద్ద ఎత్తున తియానన్మెన్ స్క్వేర్ వ‌ద్ద నిర‌స‌న‌కు దిగడంతో వారిపై స‌ర్కారు విరుచుకుప‌డింది. నిర‌స‌న‌కారుల‌పై సైనికులు కాల్పులు జ‌రిపారు. అనంత‌రం కూడా దేశ వ్యాప్తంగా వేలాది మందిని చైనా ప్ర‌భుత్వం అరెస్టు చేయించింది. అయితే, ఆ ఘ‌ట‌న‌ల‌కు బాధ్య‌త త‌మ‌దేన‌ని చైనా ప్ర‌భుత్వం ఎన్న‌డూ అంగీక‌రించ‌లేదు.