Asaduddin Owaisi: మోహ‌న్ భ‌గ‌వ‌త్ కాదు.. మోదీ భ‌రోసా ఇవ్వాలి: అస‌దుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi: మోహ‌న్ భ‌గ‌వ‌త్ కాదు.. మోదీ భ‌రోసా ఇవ్వాలి: అస‌దుద్దీన్ ఒవైసీ

Asadudding Owaisi

Asaduddin Owaisi: ”దేశంలోని ప్రతి మసీదు కింద శివ లింగాల కోసం వెతక‌డం ఎందుకు? జ్ఞాన‌వాపి మసీదు కేంద్రంగా వివాదం కొన‌సాగుతోంది. అదొక చ‌రిత్ర‌… నేటి ముస్లింలు, హిందువులు ఆ చ‌రిత్ర‌కు కార‌కులు కాదు” అని రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏఐఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ స్పందించారు. ”జ్ఞాన‌వాపీ మ‌సీదుపై మోహ‌న్ భ‌గ‌వ‌త్ చేసిన వ్యాఖ్య‌లను ఉపేక్షించ‌డానికి వీల్లేదు” అని ఆయన అన్నారు.

Uttar Pradesh Violence: రాష్ట్రప‌తి, ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న రోజే హింస జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌రం: మాయావ‌తి

”బాబ్రీ మ‌సీదు విష‌యంలో ఆందోళ‌న‌లు చేయ‌డం త‌ప్ప‌నిస‌రి అని, అందుకు చ‌రిత్ర‌కు సంబంధించిన విష‌యాలే కార‌ణ‌మ‌ని గ‌తంలో అన్నారు. మ‌రోవైపు, సుప్రీంకోర్టును ఆర్ఎస్ఎస్ గౌర‌వించ‌లేదు. మ‌సీదు కూల్చివేత‌లో పాల్గొంది. ఇప్పుడు జ్ఞాన‌వాపి విష‌యంలోనే అదే ప‌నిచేయాల‌నుకుంటున్నారా? అస‌లు ఇటువంటి వివాదాల‌పై దేశ ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇవ్వ‌డానికి మోహ‌న్ భ‌గ‌వ‌త్, జేపీ న‌డ్డా ఎవ‌రు? వారు రాజ్యాంగబ‌ద్ధ ప‌ద‌వుల్లోనూ లేరు” అని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.

Uttar Pradesh Violence: యూపీలో హింస్మాత‌క ఘ‌ట‌న కేసు.. 36 మంది అరెస్టు

”ప్రార్థనా స్థలాల చ‌ట్టం-1991కు కట్టుబడి ఉన్నామ‌ని ప్రధాని మోదీ స్పష్టమైన సందేశం ఇవ్వాలి. విశ్వ‌హిందూ ప‌రిష‌త్ ఏర్ప‌డ‌కముందు ఆర్ఎస్ఎస్ అజెండాలో అయోధ్య అంశం లేదు. 1989లో బీజేపీ చేసిన‌ పాల‌న్పూర్ తీర్మానంలో అయోధ్య అంశాన్ని చేర్చారు. ఆర్ఎస్ఎస్ రెండు నాల్క‌ల ధోర‌ణిని కొన‌సాగించ‌డంలో దిట్ట‌. కాశీ, మ‌థుర‌, కుతుబ్ మినార్ వంటి అంశాల‌ను లేవ‌నెత్తుతోన్న వారంద‌రికీ ఆర్ఎస్ఎస్‌తో లింకులు ఉన్నాయి. పాప్యులారిటీ కోల్పోతోన్న స‌మ‌యంలో ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌డం ఆర్ఎస్ఎస్ పాత వ్యూహ‌మే” అని అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు.

Jaishankar to Europe: ర‌ష్యా నుంచి మీరు గ్యాస్ దిగుమ‌తి చేసుకుంటే త‌ప్పు లేదా?: జైశంక‌ర్

”బాబ్రీ మ‌సీదుపై ఆందోళ‌న‌లు చేస్తోన్న స‌మ‌యంలోనూ కొంద‌రు ఆర్ఎస్ఎస్ నేత‌లు కోర్టు ఆదేశాల‌ను పాటిస్తామ‌ని అన్నారు. మ‌రికొంద‌రు ఇటువంటి విష‌యాల్లో కోర్టులు నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్ద‌ని చెప్పారు. బాబ్రీని ఇచ్చేస్తే మ‌రే మ‌సీదునూ ముట్టుకోబోమ‌ని కొంద‌రు అన్నారు. మ‌రికొంద‌రేమే అయోధ్య‌, కాశీ, మ‌థుర‌తో పాటు అనేక అంశాల‌ను లేవ‌నెత్తుతున్నారు. తెలంగాణ‌లోని ప్ర‌తి మ‌సీదును తొవ్వి చూడాల‌ని బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌర‌విస్తామ‌ని మళ్లీ ఇప్పుడు మోహ‌న్ భ‌గ‌వత్ అంటున్నారు. గ‌తంలో బాబ్రీ మ‌సీదు విష‌యంలోనూ ఇటువంటి హామీనే ఇచ్చారు క‌దా? అయిన‌ప్ప‌టికీ వేలాది మంది దూసుకొచ్చి దాన్ని కూల్చేశారు” అని అస‌దుద్దీన్ ఒవైసీ ట్విటర్ వేదిక‌గా స్పందించారు.