Boy playing with a python : కొండచిలువతో ఆడుకుంటున్న పసివాడు.. పేరెంట్స్‌ని తిట్టిపోస్తున్న జనం

పిల్లలు కొన్ని జంతువులతో నిర్భయంగా ఆటలు ఆడతారు. అవి కూడా పసి పిల్లలకు హాని చెయ్యవు. ఒక్కోసారి అనుకున్నట్లు జరగదు కదా.. ఓ పసివాడు భారీ కొండ చిలువతో భయం లేకుండా ఆటలు ఆడాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ చిన్నారి తల్లిదండ్రులపై మండిపడుతున్నారు.

Boy playing with a python :  కొండచిలువతో ఆడుకుంటున్న పసివాడు.. పేరెంట్స్‌ని తిట్టిపోస్తున్న జనం

Boy with a python

Boy with a python : మూడేళ్లు ఉంటాయేమో.. ఓ పసివాడు కొండచిలువతో ఆటలు మొదలుపెట్టాడు. ఏ మాత్రం భయం లేకుండా దానిపైకి ఎక్కి.. తలను కింద పడేసి ఫీట్లు చేశాడు. ఇదంతా చూసిన నెటిజన్లు షాకయ్యారు. బాలుడి పట్ల తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి మండిపడ్డారు.

Viral Video: వామ్మో.. రెండు భారీ కొండ చిలువల తోకలను పట్టుకునిలాగిన వ్యక్తి

ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్‌లో ఓ చిన్నారి కొండచిలువతో ఆటలు మొదలుపెట్టాడు. దాని తల ఎత్తి కింద పడేయడానికి ప్రయత్నించాడు. దానిపై ఎక్కి జారుతూ వదిలిపెట్టకుండా వెంబడించాడు. కొండచిలువ అతనిని చూసి కలవరపడలేదు. చిన్నారి కూడా ఏ మాత్రం భయపడలేదు. ఇక ఇదంతా చూసిన వారికి మాత్రం వణుకు వచ్చింది. ఒకవేళ కొండచిలువ బాలుడికి హాని చేస్తే అనే ఆలోచనే ఆందోళనకు గురి చేసింది.

Drunk Man Python Around His Neck : కిక్కు తలకెక్కి వృద్ధుడు ఓవరాక్షన్ .. కొండ చిలువను మెడకు చుట్టుకుంటే ఇట్టాగే ఉంటది..చుక్కలు చూపెట్టిందిగా..

ఈ వీడియోను @TheFigen అనే ట్విట్టర్ యూజర్ ‘బాధ్యతా రహితమైన తల్లిదండ్రులు’ క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది పిల్లవాడి భద్రత గురించి ఆందోళన చెందారు.. మరికొంతమంది ఆ పిల్లవాడు భయ పడకుండా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. నిజానికి ఏ మాత్రం అజాగ్రత్త వహించినా ఒక్కోసారి పరిస్థితులు ప్రమాదకరంగా మారవచ్చు.