Drunk Man Python Around His Neck : కిక్కు తలకెక్కి వృద్ధుడు ఓవరాక్షన్ .. కొండ చిలువను మెడకు చుట్టుకుంటే ఇట్టాగే ఉంటది..చుక్కలు చూపెట్టిందిగా..

మద్యం తాగినోడు తాగినట్టు ఉండకుండా ఓవర్ యాక్షన్ చేసాడు. చేపలు పట్టుకుండాదమని వెళ్లి కొండచిలువతో పెట్టుకున్నాడు. తనకేదో పెద్ద చేప దొరికేసింది ఇక పండగే పండగ అనుకున్నాడో ఏమోగానీ ఓ పెద్ద కొండచిలువను పట్టుకున్నాడు. అదికాస్త మెడకు చుట్టుకుంది. పట్టు బిగించింది. అంతే తేలకళ్లు వేశాడు. కట్ చేస్తే..

Drunk Man Python Around His Neck : కిక్కు తలకెక్కి వృద్ధుడు ఓవరాక్షన్ .. కొండ చిలువను మెడకు చుట్టుకుంటే ఇట్టాగే ఉంటది..చుక్కలు చూపెట్టిందిగా..

Drunk Man Python Around His Neck

Drunk Man Python Around His Neck : తాగినోడు తాగినట్టు ఉండకుండా ఓవర్ యాక్షన్ చేస్తే ఇట్టాగే ఉంటది.. మద్యం తాగాడు..ఇంటికెళ్లి ఏదో కాస్త చీకు ముక్కలు తిని ముసుగు పెట్టి పడుకోకుండా చేపలు పట్టుకుండాదమని వెళ్లి కొండచిలువతో పెట్టుకున్నాడు. తనకేదో పెద్ద చేప దొరికేసింది ఇక పండగే పండగ అనుకున్నాడో ఏమోగానీ ఓ పెద్ద కొండచిలువను పట్టుకున్నాడు. అదికాస్త మెడకు చుట్టుకుంది. పట్టు బిగించింది. అంతే తేలకళ్లు తేలేసాడు. రక్షించండీరా బాబూ అంటే కేకలు వేశాడు. అతని కేకలు విన్న కొంతమంది పిలకాయలు అతనిని కొండచిలువ పట్టునుంచి కాపాడదామనుకుని చేసిన యత్నాలు కాస్తా అతగాడిని ధామ్మని నీళ్లల్లో బొక్కబోర్లా పడేలా చేశాయి. కానీ పాపం వాళ్లు మాత్రం ఏచేస్తారు? కొండచిలువ పట్టు అంత గట్టిగా ఉంటుంది మరి..మద్యంతాగి.. ఆ మత్తులో చేపలకు బదులు కొండచిలువతో పరాచికాలాడుతూ ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. చివరకు గంటల తరబడి ఎంతో శ్రమపడి గ్రామస్థులు ఆ వృద్ధుడి ప్రాణాలను కొండచిలువ నుంచి రక్షించారు.

జార్ఖండ్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జార్ఖండ్‌లోని గర్వా జిల్లాలోని పరిహారా పంచాయితీకి చెందిన కితాసోటి ఖుర్ద్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల బిర్జలాల్ రామ్ భుయాన్ అనే వ్యక్తి మద్యం మత్తుతో చేపలు పట్టటానికి వెళ్లి అక్కడున్న కొండచిలువతో ఆటలాడటం మొదలుపెట్టాడు. దీంతో అదికాస్తా అతని మెడకు చుట్టుకంది.హా ఇదేం చేస్తుందిలే అనుకుని దాన్ని మెడనుంచి తీసేద్దామనుకున్నాడు కానీ సాధ్యం కాలేదు.

వృద్ధుడికి ఊపిరి ఆడకుండా చేసింది. దీంతో వృద్ధుడు తన ప్రాణాలను రక్షించమని వేడుకున్నాడు. గ్రామస్థులు బిర్జాలాల్ పరిస్థితి చూసి.. వెంటనే అతడి కొడుకుకు తెలియజేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మరికొందరి సహాయంతో గంటల తరబడి శ్రమించి కొండచిలువ పాము బారి నుండి బీర్జలాల్‌ను రక్షించాడు. ఈ సంఘటన తర్వాత వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు.