Truck Drivers Salary : సరుకులు డెలివరీ ట్రక్కు డ్రైవర్‌ జీతం రూ.70.88 లక్షలు..!

సూపర్ మార్కెట్ లో సరుకులు డెలివరీ చేసే ట్రక్కు డైవర్ కు రూ.70.88 లక్షల జీతం. పైగా మరో రెండు లక్షలకు పైగా బోనస్ కూడా ఇస్తున్నారు. మరి ట్రక్కు డైవర్లకు ఎందుకంత డిమాండ్ అంటే..

Truck Drivers Salary : సరుకులు డెలివరీ ట్రక్కు డ్రైవర్‌ జీతం రూ.70.88 లక్షలు..!

Britain Super Market Truck Drivers

truck drivers offered Over Rs. 70.88 lakh salary : కొన్ని ఉద్యోగాలు రోజంతా కష్టపడినా నామమాత్రపు జీతాలే వస్తాయి. కానీ కొన్ని ఉద్యోగాలు మాత్రం పెద్దగా కష్టపడకుండానే లక్షల్లో జీతాలొస్తాయి. మరికొన్ని ఏమాత్రం కష్టపడకుండానే కూర్చుంటే చాలు లక్షల్లో జీతాలిచ్చే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇంకొన్ని ఆహారం టేస్ట్ చూసి ఎలా ఉందో చెబితే జీతాలు భారీగా ఉంటాయి. కానీ ట్రక్కు డ్రైవర్ జీతం ఎంతుంటుంది? మహా అయితే రూ.40 వేలు.ఇంకా ఎక్కువైతే ఓ రూ.50వేలు అనుకుందాం. కానీ సరుకులు డెలివరీ చేసే ఓ టక్కు డ్రైవర్ జీతం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎంతంటే..అక్షరాలా రూ.70 లక్షలకు పైమాటే..ఇంకా చెప్పాలంటే రూ.70 లక్షల 88వేలు..!! ఏంటీ షాక్ అయ్యారా? అవ్వకేం చేస్తారు? జీతం ఆరేంజ్ లో ఉంది మరి..!

Read more : Fair Isle : ముగ్గురు విద్యార్థుల కోసం టీచర్ కావలెను..జీతం రూ.57 లక్షలు

బ్రిటన్‌లోని సూపర్ మార్కెట్లలో ట్రక్కు డ్రైవర్లకు ఇస్తున్నంత జీతం మన దేశంలో ఉన్నతస్థాయిలో పనిచేసే అధికారులకు కూడా ఉండదుని పిస్తోంది ఈ ట్రక్కు డ్రైవర్ జీతం గురించి తెలిస్తే..బ్రిటన్‌లోని ఒక ప్రముఖ సూపర్ మార్కెట్‌లో సరుకులు డెలివరీ చేసే ట్రక్కు డ్రైవర్ ఏడాది జీతం 70 వేల పౌండ్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.70 లక్షల 88 వేల 515. (ఆయా రోజులను బట్టి పైన ఉండే వందల సంఖ్యలో మార్పు రావచ్చు).

అంతేకాదండోయ్..జీతం కాకుండా పైన 2 వేల పౌండ్లు (సుమారు రూ.2,02,521) బోనస్‌ కూడా వస్తుంది. టెస్కో, సెన్స్‌బరీ తదితర కంపెనీలకు చెందిన రిక్రూటర్లు ట్రక్కు డ్రైవర్లకు ఇంత భారీ జీతాలు ఆఫర్ చేస్తున్నారు. ఎందుకంటే బ్రిటన్ లో ట్రక్కు డ్రైవర్లకు అంత డిమాండ్ ఉంది. లక్షకు పైగా ట్రక్కు డ్రైవర్ల డిమాండ్ ఉంది.

Read more : నూడిల్స్ తిని ’’టేస్ట్ ‘‘ఎలా ఉందో చెబితే చాలు నెలకు రూ.7.34 లక్షల జీతం

అందుకే మంచి అనుభవం కలిగిన ట్రక్కు డ్రైవర్లకు ఆకర్షించే జీతాలిచ్చి ఉద్యోగాల్లో పెట్టుకుంటున్నారు ఆయా మార్కెట్లవారు. దీంట్లో భాగంగానే బెర్రీ అనే ఓ ట్రక్కు డ్రైవర్ మాట్లాడుతూ తనకు ఏజెంట్ల ద్వారా మంచి జీతంతో పాటు బోనస్‌గా రెండు వేల పౌండ్లు ఇస్తామని ఆఫర్లు వస్తున్నాయని.. వారంలో ఐదు రోజులు నైట్ డ్యూటీ ఉంటుందని..తెలిపాడు.నైట్ డ్యూటీలకు అదనపు జీతం కూడా ఉంటుందని తెలిపాడు. కాగా ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఆ డ్రైవర్ హెడ్ కు కూడా అంత భారీ జీతం ఉండదట. అదే విషయం బెర్రీ చెబుతు..మా బాస్ కూడా నాకిచ్చే జీతంలో సగం కూడా ఉండదని తెలిపాడు.