Covid-19 vaccine : నా భార్యకు టీకా ఇస్తావా అంటూ నర్సు మొహం పగలగొట్టిన వ్యక్తి

నా అనుమతి లేకుండా నా భార్యకు వ్యాక్సిన్ ఎలా వేస్తావ్..అంటూ ఓవ్యక్తి నర్సు ముఖంపై పిడిగుద్దులు గుప్పించాడు.

Covid-19 vaccine : నా భార్యకు టీకా ఇస్తావా అంటూ నర్సు మొహం పగలగొట్టిన వ్యక్తి

Canadia Man Punches Nurse

Canadia man punches nurse  : తన భార్యకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినందుకు నర్సు మొఖం పగులగొట్టిన ఘటన కెనడాలోని క్యూబెక్‌ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. కరోనా నియంత్రణ కోసం వ్యాక్సిన్ వేయించుకోవాలని ఉచితంగానే టీకా పంపిణీ చేస్తున్న ప్రాంతానికి వచ్చిన ఓ మహిళ కరోనా టీకా తీసుకుంది. అయితే తన అనుమతి లేకుండా టీకా తీసుకుంటావా అంటూ ఆమె భర్త గొడవ పెట్టుకున్నాడు. అక్కడితో ఆగకుండా నా పర్మిషన్ లేకుండా నా భార్యకు టీకా ఎలా వేస్తావ్? అంటూ ఆమెకు టీకా ఇచ్చిన నర్సుపై దాడికి దిగా ఆమె మొఖం పగిలేలా కొట్టాడు. దీంతో ఆమె ఉన్నతాధికారులకు ఫోన్ చేసి చెప్పటంతో సదరు వ్యక్తిని అరెస్ట్ చేయటానికి రంగంలోకి దిగారు పోలీసులు.

Read more :Vaccination అలర్ట్.. వ్యాక్సిన్ తీసుకున్న 20 రోజుల్లోపు ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే

గత సోమవారం (సెప్టెంబర్ 20,2021) కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్‌లోని మాంట్రియల్‌కు ఆగ్నేయంగా 155 కిలోమీటర్లు దూరంలో ఉండే షేర్‌బ్రూక్‌ పట్టణంలో ఉన్న ఫార్మసీలో ఓ మహిళ వ్యాక్సిన్‌ కేంద్రానికి వచ్చి టీకా వేయించుకుంది. దీంతో అక్కడికి వచ్చిన ఆమె భర్త తన భార్యకు వ్యాక్సిన్ ఇచ్చిన నర్సుపై గొడవకు దిగాడు. ‘నా అనుమతిలేకుండా తన భార్యకు వ్యాక్సిన్‌ ఇస్తావా అంటూ నర్సుపై దాడికి దిగాడు. ఆవేశంలో ఆమె మొహంపై విచక్షణారహితంగా పిడిగుద్దులు గుప్పించాడు.

Read more : Covid Vaccine : షాకింగ్.. బీజేపీ నేతకు 5 డోసుల వ్యాక్సిన్‌.. ఆరో టీకాకు షెడ్యూల్‌

దీంతో తీవ్రంగా గాయపడింది. దీంతో తోటి మెడికల్ సిబ్బంది ఆమెను హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సదరు వ్యక్తి గురించి అడిగారు. కానీ అప్పటికే అతను పరారయ్యాడు. దీంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. కాగా..కెనడా వ్యాప్తంగా వ్యాక్సినేషన కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వం అందరికీ టీకా పంపిణీ చేస్తోంది. ఈక్రమంలో జరిగిన ఈ ఘటనతో సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయటానికి గాలిస్తున్నారు.