Vaccination అలర్ట్.. వ్యాక్సిన్ తీసుకున్న 20 రోజుల్లోపు ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే

కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని నిపుణులు తేల్చి చెప్పారు. దీంతో ప్రపచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ప్ర్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అర్హ

Vaccination అలర్ట్.. వ్యాక్సిన్ తీసుకున్న 20 రోజుల్లోపు ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే

Vaccination

Vaccination : కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని నిపుణులు తేల్చి చెప్పారు. దీంతో ప్రపచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ప్ర్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అర్హులందరికి టీకాలు ఇస్తున్నారు. ఎలాంటి అపోహలు, అనుమానాలు, భయాలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. మన దేశంలోనూ వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. రికార్డు స్థాయిలో టీకాలు ఇస్తున్నారు.

అయితే, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత స్వల్పమైన సైడ్ ఎఫెక్ట్ లు రావడం కామన్. జ్వరం, నొప్పులు వస్తాయి. ఆ తర్వాత తగ్గిపోతాయి. అంతా నార్మల్ అయిపోతుంది. అయితే, కొన్ని సందర్భాల్లో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తితే మాత్రం అలర్ట్ అవ్వాల్సిందే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Mother Drink Urine : గుండెలు పిండే విషాదం.. తన మూత్రం తానే తాగిన తల్లి

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 20 రోజుల్లోపు పలు లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు. తక్షణమే కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. డాక్టర్ ను కలవాలని సూచించారు. అలసట, తలనొప్పి, కండరాల అసౌకర్యం, చలి, జ్వరం, వికారం వంటివి… టీకా తీసుకున్న తర్వాత తరచుగా వచ్చే దుష్ప్రభావాలు. కొన్ని లక్షణాలు అరుదైన సందర్భాలలో సంభవిస్తాయి.

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రమాదకరమైన దుష్ప్రభావాల కేసులు అరుదుగా ఉన్నప్పటికీ, సమస్యలను నివారించడానికి ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. సాధారణ దుష్ప్రభావాలు రోజువారీ పనులను పూర్తి చేయడం కష్టతరం చేస్తాయి. కానీ అవి సాధారణంగా కొన్ని రోజుల్లోనే వెళ్లిపోతాయి. ఏదేమైనా, రక్తం గడ్డకట్టడం వంటి కొన్ని దుష్ప్రభావాలు ప్రాణాంతకం కావచ్చు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇంజెక్షన్ తర్వాత కొన్ని సందర్భాల్లో ఇది గమనించబడింది. కార్డియాక్ మయోకార్డిటిస్ కేసులు కూడా mRNA టెక్నాలజీ ఆధారంగా ఫైజర్ టీకా పొందిన కౌమారదశలో ఉన్న అబ్బాయిలలో నమోదు చేయబడ్డాయి. అయితే, భారతదేశంలో, టీకా ఉపయోగం కోసం ఇంకా లైసెన్స్ పొందలేదు.

Online Auction : ఒక్క రూపాయి ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా..ఒక్క నాణెం మిలియనీర్‌‌ను చేసింది

కేంద్రం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో ఒక గ్రాఫిక్‌ను పోస్ట్ చేసింది. ఏదైనా కోవిడ్ -19 వ్యాక్సిన్ పొందిన 20 రోజుల్లోపు ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే డాక్టర్‌కి చూపించుకోవాలని సలహా ఇచ్చింది. టీకాలు తీసుకున్న 20 రోజుల్లోపు ఈ క్రింది లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలంది.

* శ్వాస ఆడకపోవుట
* ఛాతి నొప్పి
* వాంతులు లేదా నిరంతర కడుపు నొప్పి
* అస్పష్టమైన దృష్టి లేదా కళ్ళలో నొప్పి
* తీవ్రమైన లేదా నిరంతర తలనొప్పి
* ఏదైనా శరీర భాగంలో బలహీనత
* మూర్ఛలు
* అవయవాలలో నొప్పి లేదా చేతులు లేదా పాదాలలో వాపు