Mother Drink Urine : గుండెలు పిండే విషాదం.. తన మూత్రం తానే తాగిన తల్లి

ఈ భూమ్మీద అమ్మ ప్రేమను మించింది మరొకటి లేదు. పిల్లలను కాపాడుకోవడానికి తల్లి ఎంతటి కష్టాన్ని అయినా భరిస్తుంది. ఎలాంటి త్యాగానికైనా వెనకాడదు. పిల్లల క్షేమం కోసం తన ప్రాణాలను కూడా పణం

Mother Drink Urine : గుండెలు పిండే విషాదం.. తన మూత్రం తానే తాగిన తల్లి

Mother Drink Urine

Mother Drink Urine : ఈ భూమ్మీద అమ్మ ప్రేమను మించింది మరొకటి లేదు. పిల్లలను కాపాడుకోవడానికి తల్లి ఎంతటి కష్టాన్ని అయినా భరిస్తుంది. ఎలాంటి త్యాగానికైనా వెనకాడదు. పిల్లల క్షేమం కోసం తన ప్రాణాలను కూడా పణంగా పెడుతుంది. అదీ తల్లి ప్రేమ అంటే. ఆ అమ్మ కూడా అలాంటిదే. పిల్లలను బతికించుకోవడానికి తన మూత్రం తానే తాగింది ఆ మాతృమూర్తి. మృత్యువు అంచులో బిడ్డల ప్రాణాలు కాపాడి తాను కన్నుమూసింది. కుటుంబంతో సహా పెను ఆపదలో చిక్కుకుపోయిన వేళ… బిడ్డలను కాపాడుకునేందుకు ఆ తల్లి వ్యవహరించిన తీరు హృదయాలను ద్రవింపజేస్తోంది.

Junk Mails Delete : అదేపనిగా జంక్ మెయిల్స్ వస్తున్నాయా? ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు!

దక్షిణ అమెరికాలో హృదయవిదారక ఘటన జరిగింది. తన పిల్లలతో సముద్రంలో చిక్కుకున్న తల్లి.. వారిని బతికించాలని భావించింది. పిల్లలకు పాలు ఇచ్చే శక్తి కోసం.. తన మూత్రాన్ని తానే తాగింది. అలా మూత్రం తాగి.. పిల్లలకు పాలిచ్చింది. పిల్లలను అయితే కాపాడుకోగలిగింది కానీ.. డీహైడ్రేషన్ కారణంగా పరిస్థితి విషమించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

Breast milk for children, urine for himself

వెనిజులాకు చెందిన మెరిలీ చాకోన్(40) తన భర్త, ఆరేళ్ల కొడుకు, రెండేళ్ల కూతురు, 25 ఏళ్ల ఓ సహాయక సిబ్బందితో కలిసి సెప్టెంబర్ 3న కరేబీయన్ దీవుల్లో విహారానికి వెళ్లారు. హిగురుటో నుంచి టోర్టుగా దీవికి కుటుంబమంతా ఓడలో బయలుదేరారు. సరదాగా సాగుతుందనుకున్న ప్రయాణంలో అనుకోని ప్రమాదం ఆ కుటుంబాన్ని ఆపదలో పడేసింది. భారీ అలలు ఓడను ముంచెత్తడంతో.. ఓడ రెండుగా చీలిపోయింది. కొంత భాగం నీటిలో మునగగా… మరికొంత భాగం పైకి తేలింది. ఈ ప్రమాదంలో చాకొన్ భర్తతో పాటు ఓడలో ప్రయాణిస్తున్న మరికొందరు గల్లంతయ్యారు.

Venezuela

చాకొన్ తన ఇద్దరు పిల్లలతో కలిసి లైఫ్ బోట్ సాయంతో ఓడ నుంచి బయటపడి సాయం కోసం ఎదురుచూడసాగింది. కానీ ఆ నడి సముద్రంలో వారికి సాయం చేసేవారు ఎవరూ లేరు. అలా ఆ ముగ్గురు నాలుగు రోజుల పాటు తిండి, తిప్పలు లేక అదే లైఫ్ బోట్‌లో నిస్సహాయంగా ఉండిపోయారు. ఎండి వేడి ఎక్కువగా ఉండటం, నీళ్లు, ఆహారం లేకపోవడంతో అప్పటికే శరీరాలు డీహైడ్రేషన్‌కు గురయ్యాయి. ఈ స్థితిలో తన బిడ్డలను బతికించుకోవడానికి ఒక్కటే మార్గం ఉందని ఆ తల్లి భావించింది. పిల్లలకు పాలిచ్చి వారిని డీహైడ్రేషన్ నుంచి కాపాడాలనుకుంది. పాలు రావాలంటే శరీరం డీహైడ్రేషన్ నుంచి బయటపడాలి. ఇందుకోసం తన మూత్రాన్ని తానే సేవించింది. ఆపై పిల్లలకు కొన్ని పాలిచ్చి వారిని బతికించుకోగలిగింది. కానీ డీహైడ్రేషన్ ఎక్కువై శరీరంలో అవయవాలు దెబ్బతినడంతో ఆమె చనిపోయింది.

Aadhaar : మీ ఆధార్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో చెక్ చేయండిలా!

Revelan

చనిపోయిన తల్లిని పట్టుకుని ఆ ఇద్దరు చిన్నారులు లైఫ్ బోట్‌లోనే ఉండిపోయారు. నాలుగు రోజుల తర్వాత వెనిజులాకు చెందిన ఓ నౌక ఒకటి అటువైపు రావడంతో… లైఫ్ బోట్‌లో ఉన్న చిన్నారులను గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని వారిని రక్షించారు. అప్పటికే చాకొన్ మృతి చెందినట్లు గుర్తించారు. ఆ కుటుంబానికి సాయంగా వెళ్లిన 25 ఏళ్ల వెరోనికా మార్టినెజ్‌ను కూడా వారు రక్షించగలిగారు. ఎండ వేడి, డీహైడ్రేషన్‌ను తట్టుకునేందుకు ఆమె ఓ ఐస్ బాక్సులో దాక్కున్నట్లు వారు గుర్తించారు. రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకోవడానికి మూడు, నాలుగు గంటలు ముందే చాకోన్ చనిపోయింది. పిల్లలను కాపాడుకునేందుకు మెరిలీ చాకొన్ చేసిన త్యాగం అందరి హృదయాలను ద్రవింపజేసింది. మాతృప్రేమకు చాకోన్ నిలువెత్తు నిదర్శనం అని ప్రశంసిస్తున్నారు.