Chinese Millionaire : చిన్న కారణానికి బ్యాంకు సిబ్బందికి చుక్కలు చూపించిన బిలియనీర్

భారత దేశంలో బ్యాంకు సిబ్బంది ఖాతా దారులతో ఎలా ప్రవర్తిస్తారో అందరికి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయినా మనం ఇక్కడ వారిని ఏమీ చేయలేక మన పని చేసుకుని సైలెంట్ గా వెళ్లిపోతాం.

Chinese Millionaire : చిన్న కారణానికి బ్యాంకు సిబ్బందికి చుక్కలు చూపించిన బిలియనీర్

China Millionaire

Chinese Millionaire :  భారత దేశంలో బ్యాంకు సిబ్బంది ఖాతా దారులతో ఎలా ప్రవర్తిస్తారో అందరికి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయినా మనం ఇక్కడ వారిని ఏమీ చేయలేక మన పని చేసుకుని సైలెంట్ గా వెళ్లిపోతాం. చైనాలో ఇటీవల బ్యాంకుకు వచ్చిన ఒక కస్టమర్ పట్ల బ్యాంకు సిబ్బంది వ్యవహరించిన తీరు అతనికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో తన ఖాతాలో ఉన్న డబ్బు మొత్తాన్ని విత్‌డ్రా చేసేశాడు.

మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే రూ.5.8 కోట్లు. పోనీ డ్రా చేసిన సొమ్ము వెంటనే తీసుకువెళ్ళాడా అంటే అదీ లేదు. మీరు ఇచ్చిన దానిలో లెక్క తేడా ఉందని చెప్పి ఆ మొత్తాన్నితన కళ్లముందే తిరిగి లెక్క పెట్టాలని కోరాడు. ఇదేం బాధరా నాయనా అనుకుంటూ స్టాఫ్ అంతా కలిసి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఒక్కో కట్ట లెక్కపెట్టి మరీ అప్పచెప్పారు.

Also Read : Match Box : పెరగనున్న అగ్గిపెట్టెల ధరలు

ఇంతటితో అయిపోలేదు… రోజుకు ఐదు మిలియన్ యువాన్ల పరిమితి ఉంది కనుక ఈరోజు ఇంతటితో వదిలేశాను… రేపు వచ్చి నా ఖాతా మొత్తం ఖాళీ చేసి తీసుకువెళతానని బ్యాంకు సిబ్బందిని హెచ్చరించి మరీ వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఇంతకీ సన్‌వేర్ అనే ఈ బిలియనీర్ కోపానికి కారణం ఏంటో తెలుసా…. అయ్యగారు బ్యాంకులోకి రాగానే అక్కడి బ్యాంకు భద్రతా సిబ్బంది మాస్కు ధరించమని కొంచెం దురుసుగా చెప్పారుట. మాస్క్ పెట్టుకోమని చెప్పినందుకు ఇంత హంగామా చేశాడీ బిలియనీర్