Match Box : పెరగనున్న అగ్గిపెట్టెల ధరలు
దేశంలో 14 ఏళ్ల తర్వాత అగ్గిపెట్టెల ధరలు పెరగనున్నాయి. ఇప్పటి దాకా ఒకరూపాయికి దొరుకుతున్న అగ్గిపెట్టె డిసెంబర్ 1నుంచి 2 రూపాయలు కానుంది.

Match Box Rate Increase
Match Box : దేశంలో 14 ఏళ్ల తర్వాత అగ్గిపెట్టెల ధరలు పెరగనున్నాయి. ఇప్పటి దాకా ఒకరూపాయికి దొరుకుతున్న అగ్గిపెట్టె డిసెంబర్ 1నుంచి 2 రూపాయలు కానుంది. అగ్గి పుల్లల తయారీలో వినియోగించే 14 రకాల ముడి పదార్ధాల ధరలు పెరగడమే ఇందుకు కారణమని తయారీ దారులు ప్రకటించారు.
రెడ్ ఫాస్ఫరస్, మైనం, పొటాషియం క్లోరేట్, గంధకం, బాక్స్ బోర్డులు, పేపరు, ధరలు గతం కంటే భారీగా పెరిగాయని వాటితో పాటు… జీఎస్టీ ప్రభావం, పెట్రో ధరల పెరుగుదల కారణంగా పెరిగిన రవాణా చార్జీల వల్ల అగ్గిపెట్టె ధరను పెంచాల్సి వచ్చిందని వారు తెలిపారు.
Also Read : Drugs Export in Lehengas : మహిళల దుస్తుల్లో డ్రగ్స్ కుట్టి విదేశాలకు సరఫరా
ఇటీవల శివకాశీలో సమావేశమైన 5 అగ్గిపెట్టెల తయారీ దారుల సంఘాలు ధరలు పెంచాలని నిర్ణయించాయి. అగ్గిపెట్టె ధరను 2007 వ సంవత్సరంలో 50 పైసలు నుంచి 1 రూపాయికి పెంచారు. మళ్లీ 14 ఏళ్ల తర్వాత ఇప్పడు వీటి ధరను పెంచుతున్నారు. తమిళనాడులో అగ్గిపెట్టెల పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా 4 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని అంచనా.