Drugs Export  in Lehengas : మహిళల దుస్తుల్లో డ్రగ్స్ కుట్టి విదేశాలకు సరఫరా

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మాదక ద్రవ్యాల డ్రగ్స్ సరఫరా అంశంపై అట్టుడికి పోతుంటే.... వాటిని అక్రమ మార్గంలో చేరవేసేందుకు పెడ్లర్లు కూడా ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నారు.

Drugs Export  in Lehengas : మహిళల దుస్తుల్లో డ్రగ్స్ కుట్టి విదేశాలకు సరఫరా

Drugs Supply

Drugs Export  in Lehengas  :  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మాదక ద్రవ్యాల డ్రగ్స్ సరఫరా అంశంపై అట్టుడికి పోతుంటే…. వాటిని అక్రమ మార్గంలో చేరవేసేందుకు పెడ్లర్లు కూడా ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే మాదక ద్రవ్యాలను ఏపీలో నర్సాపురం అడ్రస్‌తో లెహంగాల్లోని ఫాల్స్ లో పెట్టి కుట్టి విదేశాలకు తరలిస్తుండగా ఎన్సీబీ అధికారులు పట్టకున్నారు.

వివరాల్లోకి వెళితే … కొరియర్ ద్వారా ఆస్ట్రేలియాకు మాదక ద్రవ్యాలను రవాణా చేసేందుకు లెహంగాల్లోని ఫాల్స్‌లో కోట్లు విలువ చేసే మాదక ద్రవ్యాలను పెట్టి కుట్టేశారు. మూడు లెహెంగాల్లోని ఫాల్స్‌లో 3 కేజీల మిథిలీన్‌ డైఆక్సీ మిథాంఫిటమిన్‌ (ఎండీఎంఏ) డ్రగ్‌ పెట్టి చెన్నైకి చెందిన పెడ్లర్‌ ఏపీలోని నర్పాపురం అడ్రస్‌తో హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ కొరియర్‌ ఏజెన్సీ ద్వారా కన్‌సైన్‌మెంట్‌ బుక్‌ చేశాడు.

ఈ విషయమై ఎన్‌సీబీ అధికారులకు విశ్వసనీయమైన సమాచారం అందడంతో ఆ పార్శిల్‌ను ట్రాక్‌ చేశారు. బెంగళూరు ఎయిర్‌పోర్టులో గురువారం పార్శిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పార్శిల్‌ను తెరిచి చూడగా మూడు లెహెంగాల్లో ఎండీఎంఏ డ్రగ్స్‌ దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు చెన్నైలోని నిందితుడి అసలు అడ్రస్‌ గుర్తించి, శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. పార్శిల్‌ను పంపేందుకు ఈ పెడ్లర్‌ నకిలీ డాక్యుమెంట్లు వినియోగించినట్లు విచారణలో తేలింది.

మరో కేసులో…… బెంగుళూరు కేంద్రంగా సాగుతున్న మాదక ద్రవ్యాల దందాను అధికారులు చేధించారు. శనివారం బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న కారును ఎన్‌సీబీ అధికారులు దేవనహల్లి చెక్‌పోస్టు వద్ద ఆపి తనిఖీ చేయగా, హై గ్రేడ్‌ గంజాయితో పాటు ఎండీఎంఏ పిల్స్, మిథాంఫిటమిన్, మెథక్వలోన్‌ లభ్యమైనట్లు ఎన్‌సీబీ బెంగళూర్‌ జోనల్‌ డైరెక్టర్‌ అమిత్‌ గౌవాటే తెలిపారు.

Also Read : Extra Marital Affair : కాంట్రాక్ట్ కిల్లర్స్‌తో మాజీ జవాన్‌ను చంపించిన హెడ్ కానిస్టేబుల్

ఈ కేసులో హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న కారులోని నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా… వారిలో ఒకరు విశాఖపట్నానికి చెందిన వ్యక్తి కాగా, మిగిలిన ముగ్గురు హైదరాబాద్‌లో నివసిస్తున్న బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు. డ్రగ్స్‌ను వీకెండ్‌ పార్టీలకు సరఫరా చేసేందుకు వెళ్తున్నారని, హైదరాబాద్‌లోని పలు పబ్బుల్లోకి ఈ డ్రగ్స్‌ సరఫరా చేయనున్నట్లు వారు చెప్పారు.నిందితులు ఇచ్చిన సమాచారంతో బెంగళూరులోని కొన్నిప్రాంతాల్లో దాడి జరిపి కొంత గంజాయితో పాటు ఎండీఎంఏ, ఇతర డ్రగ్స్‌ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.