London : వ్యాన్‌ను జుట్టుతో లాగేసింది..నెటిజన్ల ట్రోలింగ్..ఏ షాంపు వాడుతున్నావు తల్లీ

34 సంవత్సరాలు గల అనాస్టాసియా సావికా...ఈమె సర్కస్ ఆర్టిస్టు. 20 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి...హెయిర్ హ్యాంగింగ్ విద్య నేర్చుకుంది.

London : వ్యాన్‌ను జుట్టుతో లాగేసింది..నెటిజన్ల ట్రోలింగ్..ఏ షాంపు వాడుతున్నావు తల్లీ

Hair

Anastasia Sawicka : సాహసాలు చేయడం కొంతమందికి హాబీ. సాహసాలు, ఫీట్లు చేస్తూ..రికార్డులు సృష్టిస్తుంటారు. ఈ సాహసాలు చూస్తుంటే..కొన్ని వింతగా అనిపిస్తుంటాయి. ఇలాగే…ఓ యువతి..చేసిన సాహసానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. జుట్టుకు కొక్కెంలాంటి వస్తువు బిగించుకుని..ఏకంగా పెద్ద వ్యాన్ నే లాగేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యింది. దీంతో నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఏ షాంపు వాడావు తల్లి…అంత ధృడంగా ఉంది నీ జట్టు..అంటే కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి..కనుక…ఇలాంటి పరిస్థితి నెలకొందంటూ..వ్యగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.

Read More : Domestic Flights : దేశీయ విమానాలపై ఆంక్షలు ఎత్తివేత.. పూర్తిస్థాయి సీటింగ్ కు అనుమతి

34 సంవత్సరాలు గల అనాస్టాసియా సావికా…ఈమె సర్కస్ ఆర్టిస్టు. 20 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి…హెయిర్ హ్యాంగింగ్ విద్య నేర్చుకుంది. సెంట్రల్ లండన్ రోడ్డు మీద నిలబడింది. ముందుగా ఆమె జుట్టకు కొక్కెంలాంటి తాడు తగిలించి చివరి కొనను ఓ పెద్ద వ్యాన్ కు తగిలించారు. అనంతరం మెల్లిమెల్లిగా వ్యాన్ ను జుట్టుతో లాక్కొంటూ వచ్చారు అనాస్టాసియా. ఈమె చేసిన ఫీట్ కు అందరూ అవాక్కయ్యారు. రోడ్డు మీద అందరూ చూస్తుండగానే..పెట్రోల్ పంపు వరకు వ్యాన్ ను లాక్కొచ్చారు.

Read More : Rahul Dravid: టీమిండియా కోచ్ పదవి ఆఫర్ సున్నితంగా తిరస్కరించిన ద్రవిడ్

అయితే..ఈ ఫీట్ చేయడానికి ఓ రీజన్ ఉందంటున్నారు కొంతమంది. లండన్ లో పెట్రో ఉత్పత్తుల కారణంగా…పలు పెట్రోల్ బంకులు మూసుకుంటున్నాయి. దీంతో పెట్రోల్ లేక చాలా వాహనాలు నిలిచిపోతున్నట్లు సమాచారం. వ్యాన్ లో డీజిల్ అయిపోతే…ఆగిపోయిందని..అందుకే అలా చేసి ఉంటారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే..జట్టుకు ధృడంగా ఉండడానికి రోజుకు రెండు బాటిల్స్ కండిషనర్స్ ను ఉపయోగిస్తుందంట. అంతేకాదు..తన జుట్టును 9 కోట్ల రూపాయలకు ఇన్సూరెన్స్ కూడా చేయించుకుందంట.