Domestic Flights : దేశీయ విమానాలపై ఆంక్షలు ఎత్తివేత.. పూర్తిస్థాయి సీటింగ్ కు అనుమతి

దేశీయ విమానాలపై కేంద్రం ఆంక్షలు ఎత్తివేసింది. విమానయాన సంస్థలు ఈ నెల 18వ తేదీ నుంచి దేశీయ సర్వీసులను ఎలాంటి పరిమితి లేకుండా పూర్తిస్థాయి సామర్థ్యంతో నడుపుకోవడానికి అనుమతి ఇచ్చింది.

Domestic Flights : దేశీయ విమానాలపై ఆంక్షలు ఎత్తివేత.. పూర్తిస్థాయి సీటింగ్ కు అనుమతి

Flight

central government lifted restrictions : దేశీయ విమానాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసింది. విమానయాన సంస్థలు ఈనెల 18వ తేదీ నుంచి దేశీయ సర్వీసులను ఎలాంటి పరిమితి లేకుండా పూర్తిస్థాయి సామర్థ్యంతో నడుపుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదలు చేసింది. కరోనాకు ముందు నడిపిన విమాన సర్వీసుల్లో 85 శాతాన్నే ప్రస్తుతం ఆ సంస్థలు నడుపుతున్నాయి.

ప్రయాణికుల డిమాండ్‌ను సమీక్షించిన అనంతరం సర్వీసుల సంఖ్యపై ఆంక్షలను తొలగించాలని నిర్ణయించినట్లు విమానయాన శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 12-సెప్టెంబర్‌ 18 మధ్య 72.5 శాతం, జూలై 5-ఆగస్టు 12 మధ్య 65 శాతం, జూన్‌ 1-జూలై 5 మధ్య 50 శాతం సర్వీసులనే విమానయాన సంస్థలు నడిపాయి. ఇప్పుడు ఆంక్షలను తొలగించడంతో విమాన టికెట్ల రేట్లు దిగివస్తాయని భావిస్తున్నారు.

India Petrol : కన్నీళ్లు తెప్పిస్తున్న పెట్రో ధరలు, హైదరాబాద్‌లో లీటర్ రూ. 108

విమాన ప్రయాణం చేసే ఎంపీల విషయంలో పాటించాల్సిన నియమాలు, అందించాల్సిన ప్రత్యేక సేవలకు సంబంధించిన మార్గదర్శకాలను పౌరవిమానయాన శాఖ విడుదల చేసింది. విమానయాన సంస్థలు, దేశంలోని డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులు ఈ నిబంధనలు పాటించాలని తెలిపింది. విమానాశ్రయాల్లో సేవల విషయంలో కొందరు ఎంపీలు అసౌకర్యానికి గురవుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు పేర్కొంది.

ఎంపీలకు టీ, కాఫీ, మంచినీటిని ఉచితంగా అందించాలి. విశ్రాంతి కోసం విమానాశ్రయాల్లో ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలి. వాహనాల పార్కింగ్‌ కోసం వీఐపీ కారు పార్కింగ్‌ స్లాట్‌ కేటాయించాలి. సెక్యూరిటీ చెకింగ్‌లో ప్రాధాన్యం ఇవ్వాలి. విమానంలో నచ్చిన సీట్లను కేటాయించాలి.

Massive Power Cut: దేశంలో కరెంట్ కోతలు మొదలయ్యాయ్.. గంటల కొద్దీ నో పవర్

ముందు వరుస సీట్లను కేటాయించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. చెక్‌-ఇన్‌ ఫార్మాలిటీలు పూర్తి చేయడానికి డ్యూటీ మేనేజర్‌ లేదా సీనియర్‌ స్టాఫ్‌ సాయం అందించాలి. ఎయిర్‌పోర్ట్‌ను విడిచి వెళ్లేంతవరకూ ఎంపీతో ఓ ప్రొటోకాల్‌ అధికారి ఉండాలి. ఆ అధికారికి తగిన శిక్షణ ఇవ్వాలి.