India Petrol : హైదరాబాద్‌లో లీటర్ రూ. 108, సామాన్యుడిని హడలెత్తిస్తున్న పెట్రోల్

బండి తీసుకుని పెట్రోల్ బంకులోకి వెళ్లాలంటే..కన్నీళ్లు వస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు పెరుగుతున్న ధరలతో బెంబేలెత్తిపోతున్నారు.

India Petrol : హైదరాబాద్‌లో లీటర్ రూ. 108, సామాన్యుడిని హడలెత్తిస్తున్న పెట్రోల్

Petrol

Updated On : October 13, 2021 / 10:32 AM IST

Petrol And Diesel Price : బండి తీసుకుని పెట్రోల్ బంకులోకి వెళ్లాలంటే..కన్నీళ్లు వస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు పెరుగుతున్న ధరలతో బెంబేలెత్తిపోతున్నారు. లీటర్ పెట్రోల్ ఏకంగా వంద దాటి పోతోంది. లీటర్ పెట్రోల్ రూ. 100 దాటితే..తాము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. నిత్యం వెహికల్స్ మీద వెళ్లేవారు..మూలకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గత కొన్ని రోజులుగా పెట్రో ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. తాను కూడా తక్కువ తినలేదు..అంటూ డీజిల్ ధర కూడా క్రమక్రమంగా పెరుగుతూ..సెంచరీ మార్క్ ను దాటుతోంది.దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 104.44, డీజిల్ రూ. 93.17 కి చేరుకుంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ. 108.64,డీజిల్ రూ. 101.66గా ఉంది.

Read More : America : గన్ కల్చర్, మరోసారి కాల్పులు

ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ లీటర్ పెట్రోల్ రూ. 104.44. లీటర్ డీజిల్ రూ. 93.17
కోల్ కతా లీటర్ పెట్రోల్ రూ. 105.09. లీటర్ డీజిల్ రూ.96.28
ముంబాయి లీటర్ పెట్రోల్ రూ. 110.41. లీటర్ డీజిల్ రూ. 101.03
చెన్నై లీటర్ పెట్రోల్ రూ. 101.89 లీటర్ డీజిల్ రూ. 97.69

Read More : Massive Power Cut: దేశంలో కరెంట్ కోతలు మొదలయ్యాయ్.. గంటల కొద్దీ నో పవర్

గుర్ గావ్ లీటర్ పెట్రోల్ రూ. 101.75 లీటర్ డీజిల్ రూ. 93.57
నోయిడా లీటర్ పెట్రోల్ రూ. 101.70 లీటర్ డీజిల్ రూ. 93.80
బెంగళూరు లీటర్ పెట్రోల్ రూ. 108.08 లీటర్ డీజిల్ రూ. 98.89
భువనేశ్వర్ లీటర్ పెట్రోల్ రూ. 105.35 లీటర్ డీజిల్ రూ. 101.62

Read More : Chandrababu : డ్రగ్స్ వ్యవహారం.. చంద్రబాబు, లోకేష్, ఆ పత్రికలకు లీగల్ నోటీసులు

చండీఘడ్ లీటర్ పెట్రోల్ రూ. 100.53 లీటర్ డీజిల్ రూ. 92.90
హైదరాబాద్ లీటర్ పెట్రోల్ రూ. 108.64 లీటర్ డీజిల్ రూ. 101.66
విజయవాడ లీటర్ పెట్రోల్ రూ. 111.08 లీటర్ డీజిల్ రూ. 103.49
విశాఖపట్టణం లీటర్ పెట్రోల్ రూ. 109.50 లీటర్ డీజిల్ రూ. 101.97
జైపూర్ లీటర్ పెట్రోల్ రూ. 111.54 లీటర్ డీజిల్ రూ. 102.69