America : గన్ కల్చర్, మరోసారి కాల్పులు

అగ్రరాజ్యంగా పిలవబడే అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. ఎక్కడ పడితే అక్కడ కొంతమంది విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతున్నారు.

America : గన్ కల్చర్, మరోసారి కాల్పులు

Gun America

Two US Postal Service Employees : అగ్రరాజ్యంగా పిలవబడే అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. ఎక్కడ పడితే అక్కడ కొంతమంది విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతున్నారు. ఎక్కోడో ఒకచోట ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా..ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. 2021, అక్టోబర్ 12వ తేదీ మంగళవారం ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉద్యోగులు చనిపోయారు. ఈ ఘటన మెమ్ ఫిస్ లో చోటు చేసుకుంది.

Read More : Massive Power Cut: దేశంలో కరెంట్ కోతలు మొదలయ్యాయ్.. గంటల కొద్దీ నో పవర్

మెమ్ ఫిస్ లో పోస్టాఫీస్ ఉంది. మంగళవారం ఓ వ్యక్తి వచ్చి..తుపాకితో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఇద్దరు పోస్టల్ సర్వీసు ఉద్యోగులు బుల్లెట్లు తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాల్పులు చేసిన వ్యక్తి పోస్టల్ ఉద్యోగి అని భావిస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి సుసాన్ వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు.

Read More :Triple Talaq: వాట్సప్ లో ట్రిపుల్ తలాఖ్ చెప్పి అయిపోయిందనుకున్నాడు.. కానీ,

ఇక అమెరికాలో గన్ కల్చర్ విషయానికి వస్తే…అక్కడ కాల్పుల ఘటనలు సర్వసాధారణమైపోయాయి. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో దుండగులు తుపాకులతో రెచ్చిపోతున్నారు. తుపాకుల విషయంలో కఠిన చట్టాలు తీసుకరావాలనే డిమాండ్స్ ఉన్నా అందుకనుగుణంగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. చిన్న పిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు తుపాకులు వాడుతున్నారంటే..పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీచర్ పై కోపం వస్తే..అమాంతం…బ్యాగులోంచి గన్స్ తీసుకుని..కాల్పులు జరిపిన ఘటనలు తెలిసిందే. ఇఠీవలే అధికారంలోకి వచ్చిన బైడెన్ ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. గన్ కల్చర్ నియంత్రణపై బైడెన్ అడుగు ముందుకు వేశారని అంటున్నారు. మరి అక్కడ గన్ కల్చర్ పై కఠిన చర్యలు ఎప్పుడు వస్తాయో చూడాలి.