Chandrababu : డ్రగ్స్ వ్యవహారం.. చంద్రబాబు, లోకేష్, ఆ పత్రికలకు లీగల్ నోటీసులు

తప్పుడు ప్రచారం చేసిన రాజకీయ నేతలు, పత్రికల ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్‌ పోలీస్ శాఖ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లీగల్ నోటీసులు పంపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్..

Chandrababu : డ్రగ్స్ వ్యవహారం.. చంద్రబాబు, లోకేష్, ఆ పత్రికలకు లీగల్ నోటీసులు

Chandrababu

Chandrababu Drugs : విజయవాడ డ్రగ్స్ వ్యవహారంలో అసత్య ప్రచారం చేసిన వారిపై చర్యలకు సిద్ధమైంది పోలీస్ డిపార్ట్ మెంట్. డ్రగ్స్ ఇష్యూలో రాంగ్ మేసేజ్ పాస్ చేసిన వారికి పోలీస్ శాఖ తరుఫున లీగల్ నోటీసులు పంపారు.

Uttej: అన్నయ్యనే అనుమానిస్తావా? ఫేస్‌లో ఫేస్ పెట్టి అమ్మను తిట్టాడు

తప్పుడు ప్రచారం చేసిన రాజకీయ నేతలు, పత్రికల ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్‌ పోలీస్ శాఖ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లీగల్ నోటీసులు పంపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, దూళిపాళ్ల నరేంద్ర, కింజారపు రామ్మోహన్ నాయుడు, బోండా ఉమా, బుద్ధా వెంకన్న, పట్టాభిరాంలకు నోటీసులు పంపారు. కొన్ని పత్రికలకు కూడా లీగల్ నోటీసులు పంపిన ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటామన్నారు.

ఏపీలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోందని, మత్తుతో యువతను నిర్వీర్యం చేస్తున్నారని ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. డ్రగ్స్ డాన్స్‌గా, స్మగ్లింగ్ కింగ్‌లుగా వైసీపీ ముఖ్యనేతలు అవతారమెత్తారని విమర్శించారు. అంతేకాదు అఫ్ఘానిస్తాన్ నుంచి నేరుగా తాడేపల్లికి డ్రగ్స్ వస్తున్నాయని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.

Lifespan: ఇది తింటే.. మీ జీవితంలో 36నిమిషాలు తగ్గిపోయినట్లే

డ్రగ్స్ వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. అసలు, చంద్రబాబు కుటుంబమే డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్టు అనుమానంగా ఉందని ఆరోపించారు. అఫ్ఘానిస్తాన్‌ నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్‌ ఇంటికి డ్రగ్స్‌ సరఫరా అవుతున్నాయని అనడం దారుణం అన్నారు. తాలిబన్లతో చంద్రబాబు లింక్‌ పెట్టుకుని హెరిటేజ్‌ మాల్స్‌లో డ్రగ్స్‌ అమ్మి ఉంటాడు.. అందుకే ఇలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. హెరిటేజ్‌ సంస్థ వాహనాల్లో ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేయడమే కాక.. ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని దేశవ్యాప్తంగా సరఫరా చేసింది చంద్రబాబేనని ఆరోపించారు. ఇంకోసారి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని టీడీపీ అగ్రనేతలను హెచ్చరించారు.