Uttej: అన్నయ్యనే అనుమానిస్తావా? ఫేస్‌లో ఫేస్ పెట్టి అమ్మను తిట్టాడు

సినిమా అన్న పదమే లోకల్ కాదు. అలాంటిది 'మా'లో లోకల్, నాన్ లోకల్ అనే తేడా తీసుకుని వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు ఉత్తేజ్.

Uttej: అన్నయ్యనే అనుమానిస్తావా? ఫేస్‌లో ఫేస్ పెట్టి అమ్మను తిట్టాడు

Uttej

Uttej: సినిమా అన్న పదమే లోకల్ కాదు. అలాంటిది ‘మా’లో లోకల్, నాన్ లోకల్ అనే తేడా తీసుకుని వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు ఉత్తేజ్. నరేష్ ప్రవర్తనే సరిగా లేదని, నరేష్ వల్లే గొడవలు వచ్చాయన్నారు ఉత్తేజ్. నా ఫేస్‌లో ఫేస్ పెట్టి మా అమ్మను తప్పుడు మాట తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఉత్తేజ్. సీసీసీ అనే ప్రోగ్రామ్ ద్వారా, బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో మహా మహా కార్యక్రమాలు చేసిన అన్నయ్యనే అనుమానిస్తావా? అని ఆవేదన వ్యక్తం చేశారు.

అమెరికా ప్రోగ్రామ్‌కి వస్తే, లెక్కలు తప్పు ఉన్నాయని అన్నారని, మహానుభావుడుని అనుమానించారన్నిరు. ఓటర్లు ఎలక్షన్ ఆఫీసర్స్‌కి ఎల్లో కార్డ్‌లే ఇచ్చి ఎన్నికలు సజావుగా సాగనివ్వలేదని అన్నారు ఉత్తేజ్. నరేష్ గారి నేతృత్వంలో ఇలా ఎన్నో ఇబ్బందులు వస్తే, పోలింగ్ రోజే పరిస్థితి దారుణంగా ఉంటే, రాబోయే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలమని అన్నారు.

ఎన్నికల రోజు నరేష్ అమ్మలను తిట్టారని, మా ఆఫీసులోకి ప్రవేశించాలంటే సభ్యులు థంబ్ ఇంప్రెషన్ వేయాల్సిన పరిస్థితి తీసుకుని వచ్చారని, ఇలా ఎన్నో జరిగాయన్నారు. నరేష్ మొదటి నుంచి కూడా వేర్పాటువాదం తెచ్చారని అన్నారు. విష్ణు అన్నా.. నీవు మాను నడపగలవు. తిరుపతిలో పెద్ద విశ్వవిద్యాలయం నడుపుతున్నావు. నీకు మా నడపడం పెద్ద కష్టమేం కాదు. నువ్వు నడిపించగలవు. ఆల్ ది బెస్ట్ అంటూ ముగించారు.