ICC Mens T20 World Cup 2026: ఇంగ్లండ్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఫైనల్‌కి దూసుకెళ్లిన భారత్
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ బాదింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.
Pic Courtesy @ EspnCricInfo
ICC Mens T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్ కి దూసుకెళ్లింది. సెమీస్ లో ఇంగ్లండ్ పై గెలుపొందింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ 7 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. మార్చి 8న ఫైనల్లో న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ బాదింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ముందు 254 పరుగుల టార్గెట్ ఉంచింది. కళ్ల ముందు కొండంత లక్ష్యం ఉన్నా.. ఇంగ్లండ్ బ్యాటర్లు బెదరలేదు. దూకుడుగా ఆడారు. మరీ ముఖ్యంగా జాకబ్ బెతెల్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. పరుగుల వరద పారించాడు. ధాటిగా ఆడుతూ ఇంగ్లండ్ స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు. భారత్ ను బాగా భయపెట్టాడు. 45 బంతుల్లోనే సెంచరీ బాదిన జాకబ్.. ఇంగ్లండ్ ను విజయం అంచుల వరకు తీసుకెళ్లాడు. చివరలో వికెట్లు పడటంతో, బెతెల్ రనౌట్ కావడంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయమైపోయింది.
భారత బౌలర్లలో హార్ధిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు. అర్ష్ దీప్ సింగ్, బుమ్రా, వరుణ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. మరీ ముఖ్యంగా బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తక్కువ పరుగులు ఇచ్చి (4 ఓవర్లు 33 పరుగులు 1 వికెట్) ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలిగాడు.
