Czech President: చెక్ ప్రెసిడెంట్‌కు కొవిడ్ పాజిటివ్.. బాక్సులో ఉండి కొత్త ప్రధాని ఎంపిక

జెక్ ప్రెసిడెంట్‌గా ఉన్న మిలాస్ జెమన్‌కు కొవిడ్ పాజిటివ్ రావడంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీటర్ ఫియాలాను క్యూబికల్ గ్లాస్ లో ఉండి కొత్త ప్రధానిగా ఆదివారం నియమించారు.

Czech President: చెక్ ప్రెసిడెంట్‌కు కొవిడ్ పాజిటివ్.. బాక్సులో ఉండి కొత్త ప్రధాని ఎంపిక

Covid Positive

Czech President: చెక్ ప్రెసిడెంట్‌గా ఉన్న మిలాస్ జెమన్‌కు కొవిడ్ పాజిటివ్ రావడంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్యూబికల్ గ్లాస్ లో ఉండి కొత్త ప్రధానిగా పీటర్ ఫియాలాను ఆదివారం నియమించారు. ఫియాలా ఫైవ్ సెంటర్, సెంటర్-రైట్ ప్రతిపక్ష పార్టీల కూటమికి నాయకత్వం వహిస్తున్నారు.

పూర్తి సేఫ్టీతో డాక్టర్ తో కలిసి వీల్‌చైర్‌లో వచ్చిన జెమన్… ఇతర అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. 6 వారాల పాటు ఆసుపత్రిలో ఉన్న తర్వాత వైరస్ బారిన పడ్డాడు.

కొత్త ప్రభుత్వం విద్యుత్ సంక్షోభం, కొత్త కరోనావైరస్ వేరియంట్ సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ లోటును అధిగమించడానికి 2022 రాష్ట్ర బడ్జెట్‌ను పునర్నిర్మించాలని సంకీర్ణం యోచిస్తున్నట్లు కూడా తెలిపింది.

…………………………………………….. : ఏపీ సీఎస్ సమీర్‌ శర్మ పదివీ కాలం పొడిగింపు

‘కొత్త ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. భవిష్యత్తు కోసం మార్పుతో కూడిన ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నా’ అని కొత్త ప్రధాని ఫియాలా ఒక సమావేశంలో అన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కొత్త ప్రధానమంత్రి COVID-19ను ఎదుర్కొనేందుకు అందరూ టీకాలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. కేసులు పెరుగుతున్నందున వైద్య సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

………………………………………….. : కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ వచ్చుడో…