Throws Soup : సూప్ నచ్చలేదని..మేనేజర్ ముఖంపై పారబోసింది

ఓ రెస్టారెంట్ లో సూప్ మంచిగా లేదని మేనేజర్ ముఖంపై పారబోసిందో ఓ యువతి. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. 

Throws Soup : సూప్ నచ్చలేదని..మేనేజర్ ముఖంపై పారబోసింది

Soup

Throws Soup : రెస్టారెంట్ కు వచ్చి..తమకు కావాల్సిన ఫుడ్ ఇవ్వడం..వాటిని తినేసి..బిల్లు కట్టేసి రావడం చేస్తుంటాం. ఒకవేళ ఆ ఫుడ్ నచ్చకపోతే..మంచిగా చేసుకొని రావాలని చెప్పడం చేస్తుంటాం. అయితే..ఒక్కో సందర్భంలో హోటల్ యాజమాన్యం, సిబ్బందితో వాగ్వాదం, ఘర్షణలు జరుగుతుండడం చూస్తుంటాం.

Read More : India Petrol : ధరల్లో నో ఛేంజ్…నేటి పెట్రోల్, డీజిల్ ధరలు

అయితే..ఓ రెస్టారెంట్ లో సూప్ మంచిగా లేదని మేనేజర్ ముఖంపై పారబోసిందో ఓ యువతి. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.  ఈ ఘటన టెక్సాస్ లో చోటు చేసుకుంది. టెక్సాస్ లో ఓ రెస్టారెంట్ ఉంది. ఇక్కడకు వచ్చిన యువతి, యువకుడు స్పైసీ స్పైసీ మెక్సికన్ సూప్ ఆర్డర్ చేసింది. అయితే..అందులో ఏవో ప్లాస్టిక్ ముక్కలు కనిపించాయంటూ…రెస్టారెంట్ మేనేజర్ జన్నేల్లే బ్రోలాండ్ తో వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.

Read More : Kannada TV Actress : పెళ్ళికి ముందే అత్యాచారం చేశాడు..అత్తింటి వారు వేధిస్తున్నారు బుల్లితెర నటి కంప్లైట్

అకస్మాత్తుగా..సూప్ మేనేజర్ పై పారబోసి విసురుగా వెళ్లిపోయింది. ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఇతరుల సహాయంతో…కారు ఫొటోలు తీసి టెక్సాస్ పోలీసులకు కంప్లైట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో Inside Edition పేరిట ఉన్న యూ ట్యూబ్ లో పోస్టు చేశారు. కస్టమర్ తీరును నెట్టిజన్లు ఆక్షేపిస్తున్నారు.