Kannada TV Actress : పెళ్లికి ముందే అత్యాచారం.. అత్తింటి నుంచి వేధింపులు | బుల్లితెర నటి కంప్లైట్

పెళ్లి కాకముందే..తనపై అత్యాచారం జరిపి..బలవంతం చేస్తే..పెళ్లి చేసుకున్నాడని..అత్తింటికి వెళితే..తనను వేధిస్తున్నారని..న్యాయం చేయాలంటూ..ఓ బుల్లితెర నటి పోలీసులను ఆశ్రయించారు.

Kannada TV Actress : పెళ్లికి ముందే అత్యాచారం.. అత్తింటి నుంచి వేధింపులు | బుల్లితెర నటి కంప్లైట్

Kannada

Updated On : November 11, 2021 / 9:28 AM IST

Kannada TV Actress : పెళ్లి కాకముందే..తనపై అత్యాచారం జరిపి..బలవంతం చేస్తే..పెళ్లి చేసుకున్నాడని..అత్తింటికి వెళితే..తనను వేధిస్తున్నారని..న్యాయం చేయాలంటూ..ఓ బుల్లితెర నటి పోలీసులను ఆశ్రయించారు. కట్నం కావాలని..లేనిపక్షంలో చంపేస్తామంటూ..బెదిరిస్తున్నారని వాపోయింది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : Dulquer Salmaan : కేబీఆర్ పార్క్ లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సందడి

టీవీ, సినీ రంగంలో రాణించాలని ఓ యువతి, యువకుడు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వీరు పరిచయం అయ్యారు. టీవీల్లో అవకాశాలు కల్పిస్తానంటూ..ఆ యువతికి మాయమాటలు చెప్పాడు. ఇంటికి ఆహ్వానించి..లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇలా అనేక సార్లు..అత్యాచారం జరిపాడని, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తే…దూరంగా ఉండసాగాడని యువతి వెల్లడించింది.

Read More : Heavy Rain : ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన, తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

స్నేహితుల సహాయంతో ఒత్తిడి చేయడంతో గుడిలో తాళి కట్టాడని, ఇంటికి తీసుకెళితే..బలవంతంగా తాళి కట్టినట్లు..అతని తల్లిదండ్రులకు చెప్పాడన్నారు. దీంతో నిత్యం ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని, కట్నం కావాలంటూ…వేధించడం ప్రారంభించారన్నారు. కులం పేరుతో దూషించడం..మానసికంగా కృంగిపోవడంతో అనారోగ్యం పాలై ఆసుపత్రి పాలైనట్లు బాధిత యువతి పేర్కొన్నారు. పోలీసులు..వారిద్దరి నుంచి సమాచారం సేకరించి..దర్యాప్తు చేపట్టారు.