Dulquer Salmaan : కేబీఆర్ పార్క్ లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సందడి

ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా చాలెంజ్‌లో దుల్కర్‌ సల్మాన్‌ పాల్గొన్నారు. సినీ నటి అదితీరావ్‌ హైదరీ నుంచి చాలెంజ్‌ను స్వీకరించిన దుల్కర్ హైదరాబాద్‌ కేబీఆర్‌ పార్కు

Dulquer Salmaan : కేబీఆర్ పార్క్ లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సందడి

Dulquer (1)

Dulquer Salmaan :  మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా మార్కెట్ సృష్టించుకుంటున్నాడు. మొదట్లో కొన్ని డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రజలకి మరింత చేరువయ్యారు దుల్కర్. ఆ తర్వాత నుంచి దుల్కర్ ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నాడు. దుల్కర్ కి తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు. త్వరలో హనురాఘవపూడి డైరెక్షన్ లో దుల్కర్ నుంచి మరో డైరెక్ట్ తెలుగు ఫిలిం కూడా రాబోతుంది. తాజాగా దుల్కర్ నటించిన ‘కురుప్’ సినిమా రేపు రిలీజ్ అవ్వబోతుంది. పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

RC 15 : 7 నిమిషాల కోసం 70 కోట్లు.. రామ్ చరణ్ తో శంకర్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ..

ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా చాలెంజ్‌లో దుల్కర్‌ సల్మాన్‌ పాల్గొన్నారు. సినీ నటి అదితీరావ్‌ హైదరీ నుంచి చాలెంజ్‌ను స్వీకరించిన దుల్కర్ హైదరాబాద్‌ కేబీఆర్‌ పార్కులో మొక్కను నాటారు. ఈ సందర్భంగా దుల్కర్‌ మాట్లాడుతూ… వృక్షసంపదను సంరక్షిస్తూ పచ్చదనాన్ని పెంపొందించాలనే మంచి లక్ష్యంతో ఎంపీ సంతోష్‌కుమార్‌ ఏర్పాటుచేసిన ఈ గ్రీన్‌ఇండియా చాలెంజ్‌లో తాను భాగమవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని అన్నారు. దుల్కర్‌ సల్మాన్‌కు గ్రీన్‌ఇండియా చాలెంజ్‌ కో ఫౌండర్‌ రాఘవ సన్మానించి, వృక్షవేదం పుస్తకాన్ని అందించారు.