RC 15 : 7 నిమిషాల కోసం 70 కోట్లు.. రామ్ చరణ్ తో శంకర్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ..

వీటి కోసం శంకర్ భారీగా ఖర్చుపెట్టిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక 7 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా 70 కోట్లు ఖర్చు పెట్టించబోతున్నాడని సమాచారం. దీనిపై అధికారిక సమాచారం

RC 15 : 7 నిమిషాల కోసం 70 కోట్లు.. రామ్ చరణ్ తో శంకర్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ..

Rc15 (1)

RC 15 :  డైరెక్టర్ శంకర్ అంటే భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడంటే రాజమౌళి ‘బాహుబలి’ నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు కానీ శంకర్ కొన్ని సంవత్సరాల క్రితం నుంచే హై బడ్జెట్ సినిమాలు తీస్తున్నాడు. ఇక శంకర్ సినిమాల్లో కొన్ని సన్నివేశాలకు కోట్లు ఖర్చుపెడతాడు. ‘ఐ’ సినిమాలో ఒక సాంగ్, ‘రోబో’ సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లకే కొన్ని కోట్లు ఖర్చు పెట్టేసాడు శంకర్. ప్రస్తుతం రామ్ చరణ్ తో తెలుగు, తమిళ్ లో సినిమా చేస్తున్నాడు శంకర్. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత.

Riya Chakravarthi: సుశాంత్ కేసులో రియాకి చిన్న రిలీఫ్..

రామ్ చరణ్ కి ఇది 15వ సినిమా. దిల్ రాజుకి ఇది 50వ సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం 250 కోట్ల బడ్జెట్ ని దిల్ రాజు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. దాన్ని మించకుండా సినిమా ప్లాన్ చేసుకోవాలని దర్శకుడు శంకర్‌కు నిర్మాత చెప్పినట్లు తెలుస్తోంది. కానీ శంకర్ చేసే ప్లాన్స్ కి, షూట్స్ కి కచ్చితంగా బడ్జెట్ పెరుగుతుంది అనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీం క్యాస్ట్, క్రూ ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేసి ఈ సినిమా పై హైప్ పెంచారు. ఇటీవలే మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈ సినిమా.

Sushanth sing Rajput : సుశాంత్ గూగుల్, ఫేస్ బుక్, వాట్సాప్ డేటా కావాలి.. సుశాంత్ కేసులో మరో మలుపు

తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూట్ కి వెళ్లనుంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ భారీగా ఉన్నట్టు, వీటి కోసం శంకర్ భారీగా ఖర్చుపెట్టిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక 7 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా 70 కోట్లు ఖర్చు పెట్టించబోతున్నాడని సమాచారం. దీనిపై అధికారిక సమాచారం లేకపోయినా సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా నిలుస్తుంది. సినిమాలో ఇది చాలా కీలక సన్నివేశామని, అందుకే ఇంత ఖర్చు అని శంకర్ చెప్పినట్టు తెలుస్తుంది.

Hyper Aadi : ఇలాంటి ఫేక్ న్యూస్ రాసే వాళ్ళందర్నీ.. సైలెంట్ గా హైపర్ ఆది సెటైర్

దిల్ రాజు ఇప్పటివరకు 70 కోట్ల బడ్జెట్ తో మొత్తం సినిమానే తీయలేదు. కానీ ఇప్పుడు శంకర్‌తో సినిమాలో ఏకంగా ఒక్క సీక్వెన్స్ కోసమే 70 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఖర్చు బాగానే పెడుతున్నారు కాని రామ్ చరణ్ మార్కెట్ కి 250 కోట్లు రిటర్న్ వస్తాయా అన్నది ప్రశ్న. శంకర్ మహత్యంతో పాన్ ఇండియా రిలీజ్ చేస్తే రావొచ్చు అని లెక్కలు వేసుకుంటున్నారు.