Hyper Aadi : ఇలాంటి ఫేక్ న్యూస్ రాసే వాళ్ళందర్నీ.. సైలెంట్ గా హైపర్ ఆది సెటైర్

ఇటీవల దీపావళి స్పెషల్ ఈవెంట్ లో ఆది మంచు విష్ణుని ఇమిటేట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే విష్ణు అభిమానులు ఆదిపై దాడి చేసారని, దాడి చేయడానికి చూస్తున్నారని,

Hyper Aadi : ఇలాంటి ఫేక్ న్యూస్ రాసే వాళ్ళందర్నీ.. సైలెంట్ గా హైపర్ ఆది సెటైర్

Hyper Aadi

Hyper Aadi :  హైపర్‌ ఆది… జబర్దస్త్ కమెడియన్ గా అందరికి సుపరిచితమే. జబర్దస్త్ లో వచ్చిన క్రేజ్ ని వాడుకొని సినిమాలు, ఈవెంట్లు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. తన కామెడీ స్కిట్స్ ద్వారా నవ్వించాలని ట్రై చేస్తూ అప్పుడప్పుడు కొంతమందిని ఇమిటేట్ చేస్తూ, కొంతమందిపై కౌంటర్లు వేస్తూ వివాదాల్లో కూడా ఉంటాడు హైపర్ ఆది. గత రెండు రోజులుగా హైపర్ ఆది పై కొన్ని వార్తలు విపరీతంగా ప్రచారమవుతున్నాయి.

Shivalinga Prasad : హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ అరెస్టు

ఇటీవల దీపావళి స్పెషల్ ఈవెంట్ లో ఆది మంచు విష్ణుని ఇమిటేట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే విష్ణు అభిమానులు ఆదిపై దాడి చేసారని, దాడి చేయడానికి చూస్తున్నారని, ఆది కొద్దీ రోజులుగా ఎవరికి కనపడకుండా తిరుగుతున్నాడని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఇవన్నీ ఫేక్ న్యూస్ అంటూ ఓ వీడియో రిలీజ్‌ చేసి క్లారిటీ ఇచ్చాడు హైపర్ ఆది. ఈ వీడియోలో రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ కూడా ఉన్నారు.

Notice to Allu Arjun: అల్లు అర్జున్‌కు సజ్జనార్ లీగల్ నోటీసులు

హైపర్ ఆది ఈ వీడియోలో మాట్లాడుతూ.. ఇటీవల నాపై దాడి చేయడం కోసం ఎవరో వెతుకుతున్నారంటూ ఏవేవో ఫేక్‌ న్యూస్‌లు వస్తున్నాయి. ఇష్టమొచ్చినట్టు ఫేక్ న్యూస్ రాస్తున్నారు. మీ ఫేక్‌ న్యూస్‌లు రాసేవారికి ఒకటే చెప్తున్నా, మీ దగ్గర డబ్బుల్లేవంటే చెప్పండి, నేను సంపాదించేదాంట్లో కొంత తీసి మీకిస్తాను. అంతే కానీ ఇలా ఫేక్ న్యూస్ రాయకండి. ఇలాగే ఫేక్ న్యూస్ రాశారంటే శాంతి స్వరూప్ కి అప్పచెప్తాను మిమ్మల్ని. మీ పని తను చూసుకుంటాడు. ప్రస్తుతం నేను జబర్దస్త్ షూట్లోనే ఉన్నాను. మేమంతా హ్యాపీగా షూటింగులు చేసుకుంటున్నాం. అందరూ హ్యాపీగా ఉండండి, మేమూ హ్యాపీగా ఉన్నాం అంటూ ఫేక్ న్యూస్ పై క్లారిటీ ఇస్తూ అవి రాసేవాళ్ళకి గట్టిగానే కౌంటర్ వేశాడు.