Shivalinga Prasad : హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ అరెస్టు

హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ అరెస్టు అయ్యారు. మంచిరేవుల పేకాట కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి కోర్టులో ఆయన్ను పోలీసులు హాజరుపర్చారు.

Shivalinga Prasad : హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ అరెస్టు

Shivalinga

Updated On : November 10, 2021 / 3:24 PM IST

Manchirevula cards playing case : హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ అరెస్టు అయ్యారు. మంచిరేవుల పేకాట కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి కోర్టులో శివలింగప్రసాద్ ను పోలీసులు హాజరుపర్చారు. దీంతో నాగశౌర్య తండ్రి తరపున కోర్టులో న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

గుత్తా సుమన్ తో కలిసి శివలింగ ప్రసాద్ పేకాట దందా నిర్వహిస్తోన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన్ను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. అతనికి బెయిల్ వస్తుందా ? లేదా అనే అంశంపై సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.