Heavy Rain : ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన, తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..వాయుగుండంగా మారిందని, చెన్నై, పుదుచ్చేరికి ఆగ్నేయంగా...430 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Heavy Rain : ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన, తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

Hyd Rain

Telugu States Rain : ఏపీ, తెలంగాణతో పాటు…తమిళనాడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఆగ్నేయ బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..వాయుగుండంగా మారిందని, చెన్నై, పుదుచ్చేరికి ఆగ్నేయంగా…430 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గురువారం సాయంత్రానికి తమిళనాడులోని కరైకాల్, ఏపీలోని శ్రీహరికోట మధ్యం తీరం దాటనుందని తెలిపారు. గురు, శుక్రవారాల్లో ఏపీలోని నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

Read More : Karnataka : ఎమ్మెల్యేని మార్చేయ్..నా భర్త మందు మానేలా చూడు..దేవుడికి కోర్కెలు

వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, బుధవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అక్కడక్కడ వర్షాలు కురిశాయి. ఇక తమిళాడులోని చెన్నైతో సహా ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం చెన్నైలో అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు బయటకు రాకపోవడం మంచిదని అధికారులు సూచించారు. ఉత్తర చెన్నైతో పాటు తమిళనాడు డెల్టా ప్రాంతాల్లోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.