Karnataka : ఎమ్మెల్యేని మార్చేయ్..నా భర్త మందు మానేలా చూడు..దేవుడికి కోర్కెలు

ఆలయంలోని హుండీలో భక్తులు వేసిన లెటర్ లు చదివిన ఆలయ పూజారులు, అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కర్నాటకలో చోటు చేసుకుంది.

Karnataka : ఎమ్మెల్యేని మార్చేయ్..నా భర్త మందు మానేలా చూడు..దేవుడికి కోర్కెలు

Hasan Temple

Updated On : November 11, 2021 / 8:10 AM IST

Karnataka Temple : భక్తులు ఆలయాలకు వెళ్లి..తమ కోర్కెలు తీర్చాలని…దేవుడిని మొక్కుకుంటుంటారు. కోర్కెలు తీరగానే…మరలా వచ్చి…వారు చెప్పినట్లుగా..చేస్తుంటారు. అయితే..దేవుడిని ఏం కోరుకున్నారో..ఇతరులకు చెప్పరు. విద్యార్థులయితే..మంచి మార్కులు రావాలని, పాస్ కావాలని, నిరుద్యోగులు జాబ్ రావాలని..పెళ్లి కాని వారు మంచి సంబంధం రావాలని..ఇలా రకరకాల కోర్కెలు  కోరుకుంటుంటారు. అయితే..కొందరు భక్తులు విచిత్రమైన కోర్కెలు కూడా కోరుకుంటుంటారు. తాజాగా..ఓ ఆలయంలో భక్తులు కోరిన కోర్కెలు వైరల్ అవుతున్నాయి. ఆలయంలోని హుండీలో భక్తులు వేసిన లెటర్ లు చదివిన ఆలయ పూజారులు, అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కర్నాటకలో చోటు చేసుకుంది.

Read More : TTD : శ్రీవారికి పుష్పయాగం..8టన్నుల పుష్పాలు

కర్నాటకలోని హసన్ లో హసనంబ టెంపుల్ ఉంది. ఏడాది పొడవునా..మూసి ఉండే ఈ టెంపుల్ ను ఏటా దీపావళి సందర్భంగా..కేవలం 9 రోజులు మాత్రమే తెరుస్తారు. దీంతో భక్తులు పోటెత్తుతుంటారు. హసనంబ దేవత అంటే భక్తులకు చాలా నమ్మకం. కోరిన కోర్కెలు తీరుస్తారని అంటుంటారు. 9 రోజుల అనంతరం ఆలయాన్ని యదావిధిగా మూసివేసి..ఆలయ నిర్వాహకులు హుండీని తెరిచారు. అందులో భక్తులు సమర్పించిన కానుకలతో పాటు కొన్ని లేఖలు బయటపడ్డాయి.

Read More : Pakistan Supreme Court : మిస్టర్ పీఎం..హంతకులతో చర్చలా ?

తమ కాలనీలో రోడ్డు గుంతలమయంగా మారిపోయిందని, సమస్యను తీర్చాలని ఓ భక్తుడు కోరాడు. ఓ చీటిలో తమ నియోజకవర్గాలను కాపాడాలని, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే..అతని కుటుంబసభ్యుల ప్రవర్తన మంచిగా లేదని..వెంటనే ఎమ్మెల్యేని మార్చేయాలని కోరాడు. తన భర్త విపరీతంగా మద్యం సేవిస్తున్నాడని..ఈ అలవాటును మార్చే విధంగా చేయి తల్లి అని ఓ భక్తురాలు, తన కోరికను నెరవేర్చితే..ఆలయానికి రూ. 5 వేలు ఇస్తానని మరో భక్తుడు లేఖలో కోరారు. ఇలాంటి విచిత్రమైన లేఖలు హుండీలో బయటపడడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.