People Decreasing in Height : 6 అడుగులపైనే పొడుగు ఉండే ప్రజలు పొట్టివారైపోతున్నారు..సర్వేలో ఆసక్తికర విషయాలు

ప్రపంచంలోనే పొడువుగా ఉండే వ్యక్తులుగా పేరు పొందినవారు క్రమంగా ఎత్తు తగ్గిపోతున్నారట. ఒకప్పుడు ఆరు అడుగుల కంటే పొడవు కలిగిన ఆ దేశస్థులుక్రమంగా ఎత్తు తగ్గిపోతున్నారని సర్వే తెలిపింది

People Decreasing in Height : 6 అడుగులపైనే పొడుగు ఉండే ప్రజలు పొట్టివారైపోతున్నారు..సర్వేలో ఆసక్తికర విషయాలు

Dutch People Decreasing In Height

Dutch People Decreasing in Height : ‘మా తాత ఆరు అడుగుల పొడుగు ఆజానుబాహుడు తెలుసా?’ అని ఎవరన్నా అంటే ‘హా..అయితే మరి నువ్వేంట్రా ఇంతే ఉన్నావ్?’ అనే మాటలు వినే ఉంటాం. తాతలు పొడుగ్గా ఉంటే ఆ వంశీకులు కూడా పొడవుగానే అవుతారు. అది డీఎన్ ఏను బట్టి ఉంటుంది. కానీ ఒకప్పుడు ఆరు అడుగు పొడుగు ఉండేవారు కాలం గడుస్తున్నకొద్దీ తరాలు గడుస్తున్నకొద్దీ ఆ వంశంలో పుట్టినవారు పొడవు తగ్గుతు అయిపోతారా? అంటే నిజమేనంటోంది ఓ సర్వే. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత పొడుగు గలవారిగా పేరొందిన ఓ దేశస్థులు ఇప్పుడు అంత పొడవుగా పెరగటంలేదట..పొడవు తగ్గిపోతున్నారట. పొట్టిగా అయిపోతున్నారట. పొట్టిగా అంటే మరీ పొట్టిగా కాదు గత తరాల వారికంటే ఇప్పటివారు పొడవు తగ్గిపోతున్నారట. మరి వారు ఏదేశస్తులు ఎందుకు పొడవు తగ్గిపోతున్నారో తెలుసుకుందాం..

ఒకప్పుడు ఆరడుగుల ఆజానుభాహులకు పెట్టింది పేరు నెదర్లాండ్స్‌ దేశం. ఆ దేశంలో పురుషులతో పాటు మహిళలు కూడా ఆరు ఏడు అడుగుల ఎత్తు ఉండేవారు. అందుకే ప్రపంచంలో పొడవైన వ్యక్తులున్న నెదర్లాండ్ పేరొందింది. అలా నెదర్లాండ్ గుర్తింపు సాధించింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన జనాభా కలిగిన దేశంగా.. గత ఆరు దశాబ్ధాలుగా ఈ రికార్డు నెదర్లాండ్ పేరుమీదనే ఉంది. అయితే ఆ రికార్డుకు నెదర్లాండ్ క్రమంగా దూరమవుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది.మునుపటి తరంతో పోల్చితే క్రమంగా పొడుగు తగ్గిపోతున్నారు. 1980లో పుట్టిన వారితో పోలిస్తే 2001లో పుట్టిన వారు పొడవు తగ్గి కాస్త పొట్టిగా ఉన్నారని తాజా అధ్యయనంలో తేలింది. ఈ భూ ప్రపంచంలో ఇప్పటికే ఎక్కువ ఎత్తున జనాభా కలిగిన దేశంగా నెదర్లాండ్స్ ఉండటం విశేషం.

Read more : TATA : అత్యంత ఎత్తైన ప్రదేశంలో టాటా సోలార్‌ పవర్‌ ప్లాంట్‌

ప్రస్తుతం నెదర్లాండ్ లో 19ఏళ్ల యువకుడి సగటు ఎత్తు 6 అడుగులు(182.9 సెం.మీ) కాగా..యువతి ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు(169.3 సెం.మీ)గా ఉంది. 1980లో పుట్టిన మునుపటి తరంతో పోల్చితే 2001లో పుట్టినవారు సరాసరిగా కనీసం 1 సెంటీ మీటర్ ఎత్తు తగ్గిపోయినట్లు తెలుస్తోంది. మహిళలు 1.4 సెం.మీ మేర ఎత్తు తగ్గిపోయారు. ఆ దేశంలోని 19 నుంచి 60 ఏళ్ల వయస్కులైన 7,19,000 మంది ఎత్తుపై ఈ సర్వే నిర్వహించారు.

మరి నెదర్లాండ్స్ ప్రజలు ఎత్తు తగ్గిపోవడానికి గల కారణాలను కూడా ఈ సర్వే చేపట్టిన ఆ దేశ ప్రభుత్వ సంస్థ సెంట్రల్ బ్యూరో వూర్ డి స్టాటిస్టిక్ (సీబీఎస్) విశ్లేషించింది. సరైన పౌష్టికాహారం తీసుకోకపోవటం వల్లనే నెదర్లాండ్ ప్రజలు క్రమంగా ఎత్తు తగ్గిపోతున్నారని ఈ సర్వేలో తేలింది. పౌష్టికాహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మునుపటి తరం ఎత్తు మరింత తగ్గిపోవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు.

Read more: ప్రపంచంలోనే అతి పొట్టి వ్యక్తి ‘ఖాగేంద్ర థాపా మాగర్’ మృతి

2007లో ఏర్పడిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం నెదర్లాండ్స్‌పై తీవ్ర ప్రభావం చూపింది. అప్పట్లో ఆ దేశంలో చాలా మంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఆ ప్రభావం చిన్నారులపై బాగా పడింది. సరైన పౌష్టికాహార లోపం ఏర్పడింది. వీరి ఎత్తు తగ్గిపోవటానికి ఇది కారణమై ఉండొచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు.2007 ఆర్థిక సంక్షోభం దీనికి కారణం కావచ్చన్నన విశ్లేషణ ఊహమాత్రమేననీ.. దీన్ని నిర్థారించే శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు వెల్లడించారు.

కాగా..ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కల్చర్ పెరటం వల్ల అమెరికన్లు కూడా క్రమంగా ఎత్తు తగ్గిపోతున్నారని.. నిపుణులు అభిప్రాయపడ్డారు. సరైన డైట్ తీసుకోకపోవడం..ఎక్కువ క్యాలరీల ఆహారం తీసుకోవడం తదితరాలు కారణం కావచ్చని చెబుతున్నారు.