ప్రపంచంలోనే అతి పొట్టి వ్యక్తి ‘ఖాగేంద్ర థాపా మాగర్’ మృతి

  • Published By: veegamteam ,Published On : January 18, 2020 / 04:20 AM IST
ప్రపంచంలోనే అతి పొట్టి  వ్యక్తి ‘ఖాగేంద్ర థాపా మాగర్’ మృతి

ప్రపంచంలోనే అతి పొట్టి వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించిన ఖాగేంద్ర థాపా మాగర్ తన 27 ఏళ్ళ వయస్సులో మృతి చెందారు. నేపాల్ రాజధాని  ఖాట్మండుకు  200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోఖారాలోని ఒక ఆసుపత్రిలో న్యుమోనియాతో ఖాగేంద్ర థాపా మాగర్  శుక్రవారం (జనవరి 17,2020) మరణించాడని అతని సోదరుడు మహేష్ థాపా మాగర్ తెలిపారు. 

ఖాగేంద్ర థాపా మాగర్ తన 18వ పుట్టిన రోజు తరువాత 2010లో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో అతి చిన్న వ్యక్తిగా గుర్తించబడ్డాడు. ఖాగేంద్ర థాపా మాగర్ పొడవు 
67.08 సెం.మీ (2 అడుగులు 2.41 అంగుళాలు).

ఖాగేంద్ర థాపా మాగర్ పుట్టినప్పుడు కేవలం అరచేతిలో సరిపోయిన సైజులో ఉండేవాడు. అంత చిన్నవాడికి స్నానం చేయడం చాలా కష్టమైపోయేది అని తండ్రి రూప్ బహదూర్ చెప్పారు. ప్రపంచంలోని అతి చిన్న వ్యక్తి  27 ఏళ్ల  ఖాగేంద్ర థాపా మాగర్  12 దేశాలకు పైగా పర్యటించాడు. యూరప్ మరియు యునైటెడ్ స్టేట్స్‌లో టీవీ షోల్లో పాల్గొన్నాడు.