London: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని బోరిస్‌కు షాకిచ్చిన మరో ఐదుగురు మంత్రులు..

బ్రిటన్ లో ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఆ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలోనే మంగళవారం ఆయన ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్ మంత్రులు రాజీనామా చేశారు. బుధవారం మరో ఐదుగురు మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేశారు.

London: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని బోరిస్‌కు షాకిచ్చిన మరో ఐదుగురు మంత్రులు..

Boris

London: బ్రిటన్ లో ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఆ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలోనే మంగళవారం ఆయన ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్ మంత్రులు రాజీనామా చేశారు. ఆర్థిక మంత్రి రిషి సునాక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ లు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. రాజీనామా అనంతరం రిషి సునాక్ మాట్లాడుతూ.. బ్రిటన్ కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో ప్రభుత్వం బాధ్యతగా పనిచేయాలని అన్నారు. కానీ బోరిస్ సారథ్యంలోని ప్రభుత్వం ఆ మేరకు పని చేయడంలో విఫలమైందని, అందుకు ఆయన మంత్రి వర్గం నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు.

Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు

ఇద్దరు మంత్రులు రాజీనామా చేసి ఒక్కరోజు గడవక ముందే మరో ఐదుగురు మంత్రులు రాజీనామాలు చేశారు. వీరిలో కెమి బాడెనోచ్, నీల్ ఓ బ్రియన్, అలెక్స్ బర్గార్ట్, లీరౌలీ, జూలియా లోఫెజోలు ఉన్నారు. వారు మాట్లాడుతూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బోరిస్‌ జాన్సన్‌ను ఉన్నత పదవిలో కూర్చోబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రాజీనామా తప్ప మరో మార్గం లేదని లేఖలో స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బోరిస్ జాన్సన్​ ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయినందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

Viral Video: 300 అడుగుల లోయలో పడిన దూడ.. భారీ వర్షం.. ఎలా కాపాడారంటే..
వరుసగా మంత్రులు రాజీనామా చేస్తుండటంతో బోరిస్ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ఇటీవలే అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కిన బోరిస్ ప్రభుత్వం .. తాజాగా వరుసగా మంత్రులు రాజీనామాలు చేస్తుండటంతో కుప్పకూలే అవకాశాలు ఉన్నాయి.